ముందు చెప్పుకున్నట్టు… 2021 కంటే కూడా 2022 లో బాక్సాఫీస్ కళకళలాడి పోద్ది అని అంతా అనుకున్నారు.మరీ ముఖ్యంగా 2022 ఆరంభం చాలా గ్రాండ్ గా ఉంటుంది అని అంతా భావించారు. ఎందుకంటే ఈ ఏడాది సంక్రాంతికి ‘ఆర్.ఆర్.ఆర్’ ‘భీమ్లా నాయక్’ ‘సర్కారు వారి పాట’ ‘రాధే శ్యామ్’ వంటి బడా సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నట్టు అధికారిక ప్రకటనలు వచ్చాయి. కానీ థర్డ్ వేవ్ దెబ్బకి అలాంటిదేమీ జరగలేదు. అదృష్టం కొద్దీ థియేటర్లు అయితే క్లోజ్ అవ్వలేదు. కానీ ఒక్క ‘బంగార్రాజు’ తప్ప జనవరిలో మరో పెద్ద సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వలేదు.పోటీగా రిలీజ్ అయిన చిన్న చితకా సినిమాలు అన్నీ డిజాస్టర్ గా మిగిలాయి.
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్.. ఇలా ప్రతీ నెలలో ప్లాప్ ల నుండి భారీ ప్లాప్ ల వరకు ఉన్నాయి. ఇందులో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో మొత్తంగా పెద్ద చిన్న సినిమాలు అన్నీ కలుపుకుని… 200 వరకు రిలీజ్ అయితే అందులో ఒక 12,13 మాత్రమే బాక్సాఫీస్ వద్ద నిలబడ్డాయి. మిగిలిన అన్ని సినిమాలు ‘రాడ్డు రంబోలా’ అనిపించినవే. మరి 2022 ఫస్ట్ హాఫ్ లో భారీ అంచనాల నడుమ లేదా మంచి క్రేజ్ తో రిలీజ్ అయ్యి నిరాశపరిచి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) హీరో :
మహేష్ బాబు అక్క కొడుకు గల్లా జయదేవ్ కుమారుడు అయిన అశోక్ గల్లా తన డెబ్యూ మూవీ ‘హీరో’ తో జనవరి 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.
2) రౌడీ బాయ్స్ :
ఈ ఏడాది సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో డెబ్యూ హీరో ఆశిష్. ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
3) గుడ్ లక్ సఖి :
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 28న రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.
4) సూపర్ మచ్చి :
మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు రోజులకే ఈ మూవీ దుకాణం సర్దేసింది.
5) ఖిలాడి :
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఫిబ్రవరి 11న విడుదలైన ఈ మూవీ వీకెండ్ తర్వాత అడ్రస్ లేదు.
6) సన్ ఆఫ్ ఇండియా :
మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 18న రిలీజ్ అయ్యి మొదటి రోజు మొదటి షోకే దుకాణం సర్దేసింది. ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి.
7) సెబాస్టియన్ :
‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ చిత్రంతో గతేడాది హిట్టు కొట్టిన కిరణ్ అబ్బవరం… ‘సెబాస్టియన్’ తో మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఊహించని విధంగా బోల్తా కొట్టింది. డిజాస్టర్ గా మిగిలింది.
8) ఆడవాళ్ళు మీకు జోహార్లు :
వరుస ప్లాపుల్లో ఉన్న శర్వానంద్ కు ‘ఆడవాళ్ళు..’ హిట్ ఇస్తారు అనుకుంటే అలాంటిదేమి జరగలేదు.మార్చి 4న విడుదలైన ఈ మూవీ మొదటి వీకెండ్ తర్వాత డిజాస్టర్ లిస్ట్ లోకి చేరిపోయింది.
9) రాధే శ్యామ్ :
3 ఏళ్ళుగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన మూవీ ఇది. మార్చి 11న రిలీజ్ అయిన ఈ మూవీ ఓపెనింగ్స్ విషయంలో సూపర్ అనిపించినా తర్వాత మాత్రం సైలెంట్ గా డిజాస్టర్ లిస్ట్ లోకి చేరిపోయింది.
10) స్టాండప్ రాహుల్ :
రాజ్ తరుణ్ కు ఈ సినిమాతో సక్సెస్ వస్తుంది అని కొంత మంది భావించారు. కానీ మార్చి 18న రిలీజ్ అయిన ఈ మూవీ అలాంటి ఆశలు ఏమీ కలిగించలేదు.డిజాస్టర్ గానే మిగిలింది.
11) మిషన్ ఇంపాజిబుల్ :
తాప్సీ ప్రధాన పాత్రలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ దర్శకుడు స్వరూప్ తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 1న రిలీజ్ అయ్యి ప్లాప్ గా మిగిలింది.
12) గని :
వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ ఏప్రిల్ 8న రిలీజ్ అయ్యి ప్లాప్ గా మిగిలింది.
13) ఆచార్య :
మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాంచరణ్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.
14) భళా తందనాన :
శ్రీవిష్ణు అంటే మంచి సినిమాలు అందిస్తాడు అనే పేరుంది. ఆనందుకే ‘భళా తందనాన’ విషయంలో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మే 6న రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
15) జయమ్మ పంచాయితీ :
సుమ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన మూవీ ఇది. మే 6న రిలీజ్ అయ్యింది. కానీ జనాలు పట్టించుకోలేదు. ప్లాప్ అయ్యింది.
16) శేఖర్ :
రాజశేఖర్ ఈ మూవీతో మంచి హిట్ అందుకుంటారు అని అంతా అనుకున్నారు. మే 20న రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని విధంగా ప్లాప్ అయ్యింది.
17) అంటే సుందరానికీ :
నాని నుండీ వచ్చిన ఈ మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ టాక్ ను సంపాదించుకుంది. కానీ కమర్షియల్ గా ప్లాప్.
18) విరాట పర్వం :
రానా, సాయి పల్లవి నటించిన ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పరిస్థితి కూడా అంతే..! పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది.
19) గాడ్ సే :
సత్యదేవ్ మంచి ప్రతిభ కలిగిన నటుడు. కానీ సరైన మూవీ పడటం లేదు. జూన్ 17న రిలీజ్ అయిన ‘గాడ్ సే’ డిజాస్టర్ అయ్యింది.
20) 7 డేస్ 6 నైట్స్ :
ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ జూన్ 24న రిలీజ్ అయ్యి ప్లాప్ లిస్ట్ లోకి చేరిపోయింది.
21) చోర్ బజార్ :
ఆకాష్ హీరోగా నటించిన ఈ మూవీ జూన్ 24 న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది.
డబ్బింగ్ సినిమాల్లో :
22) సామాన్యుడు :
విశాల్ హీరోగా రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 4న రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది.
23) బీస్ట్ :
విజయ్ నటించిన ఈ మూవీ ఏప్రిల్ 13న రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది.
24) ఛార్లీ 777:
రష్మిక మాజీ లవర్ రక్షిత్ శెట్టి నటించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. జూన్ 10న రిలీజ్ అయిన ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది.
25) కె ఆర్ కె :
విజయ్, సమంత, నయనతార కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది.