అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!

సాధారణంగా అభిమానులు ఎలా ఉంటారు? తమకు ఇష్టమైన హీరో సినిమాని అందరి కంటే ముందు చూసెయ్యాలి అనుకుంటుంటారు. ఆ సినిమా కనుక సూపర్ హిట్ టాక్ వస్తే.. ఎక్కువ సార్లు ఆ సినిమాని థియేటర్లలో చూస్తుంటారు. ఒకవేళ ఆ సినిమా ప్లాప్ అయితే దానిని వెంటనే యాక్సెప్ట్ చేయలేరు. ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అలాగే తమ అభిమాన హీరోని ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేస్తే తట్టుకోలేరు. వాళ్ళతో గొడవ పడుతుంటారు.లేదా ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటారు. వీళ్ళని కల్ట్ ఫ్యాన్స్ లేదా డై హార్డ్ ఫ్యాన్స్ అంటుంటాం. ఇంకో రకం ఉంటారు.

తమ అభిమాన హీరో ఏం చేస్తే అది ఫాలో అవుతూ ఉంటారు. ఉదాహరణకి వాళ్ళు కొత్త ట్రెండ్ కు తగినట్టు టీ, షర్ట్ లు వేస్తె అలాంటి షర్ట్ లు కొనేస్తారు. అలాగే హెయిర్ స్టైల్ మారిస్తే ఆ హెయిర్ స్టైల్ ఫాలో అవుతారు. మరికొంతమంది అభిమానులు తన అభిమానాన్ని మనసులో దాచుకోవాలి అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. మనకు తెలిసి ఈ 3 రకాలే అనుకుంటాం. కానీ 4వ రకం కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా తమ ఇష్టమైన హీరో కోసం సినీ ఫీల్డ్ పై ప్రేమ పెంచుకుని…

ఇందులో ఎంటర్ అయ్యి చివరికి తమ అభిమాన హీరో సినిమాకు పని చేసినోళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉంటారా? అని ఆశ్చర్యపడొద్దు… ఉన్నారు..! కొంతమంది అయితే దర్శకులుగా కూడా మారి తమ అభిమాన హీరోలతో సినిమాలు తీసి ఆల్ టైం హిట్లు అందించారు. ఆ హీరోలు ఎవరు.. వాళ్లతో పనిచేసిన అభిమానులు అలియాస్ దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) అడవి రాముడు :

కె.రాఘవేంద్రరావు.. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి పెద్ద అభిమాని. ఆయన పని అయిపోయింది అనుకున్న టైం లో ‘అడవి రాముడు’ అనే చిత్రాన్ని తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారు.

2) నెంబర్ వన్ :

కృష్ణ గారికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇక కృష్ణ గారి పని అయిపోయింది అనుకున్న టైం లో తన అభిమాని, దర్శకుడు అయిన ఎస్వీ కృష్ణారెడ్డి గారితో సినిమా చేశాడు. ఇది బ్లాక్ బస్టర్ అయ్యింది. కృష్ణ గారు బౌన్స్ బ్యాక్ అయ్యి ఆ తర్వాత ఇంకా చాలా సినిమాల్లో నటించారు.

3) ఠాగూర్ :

‘ఇంద్ర’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరుకి ఆ వెంటనే ‘ఠాగూర్’ తో మరో బ్లాక్ బస్టర్ ను అందించారు వి.వి.వినాయక్. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రమణ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసి బ్లాక్ బస్టర్ అందించారు.

4) మాస్ :

నాగార్జునకి రాఘవ లారెన్స్ పెద్ద అభిమాని.’నేనున్నాను’ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా చేస్తున్న టైంలో ‘అన్నయ్య.. మీ అభిమానిగా మీ కోసం ఓ మాస్ కథని రెడీ చేశాను అని చెప్పి ‘దమ్ముంటే కాస్కో’ అనే టైటిల్ తో కథని వినిపించారు. చివరికి అది ‘మాస్’ గా బయటకి వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది.

5) శివాజీ(2007) :

రజినీకాంత్ కు శంకర్ వీరాభిమాని. చాలా సంవత్సరాలుగా ఆయనతో సినిమా చేయాలి అనుకున్నారు. అలా ‘శివాజీ’ ని చేశారు. ఈ సినిమా సౌత్లో రూ.100 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన తొలి చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ‘రోబో’ ‘2.o’ చిత్రాలు వచ్చాయి. అవి కూడా బ్లాక్ బస్టర్లు అయ్యాయి.

6) బాలకృష్ణ :

2004 తర్వాత 2010కి ముందు బాలయ్యకి ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు. ఇక బాలయ్య పరిస్థితి అయిపోయింది అనుకుంటున్న టైంలో బాలయ్య అభిమానిగా బోయపాటి ఓ సినిమా చేస్తాను అని రిక్వెస్ట్ చేసి సినిమా చేశాడు. అది బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత ‘లెజెండ్’ ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్స్ కూడా వీరి కాంబినేషన్లో వచ్చాయి.

7) గబ్బర్ సింగ్ :

పవన్ కళ్యాణ్ కి హరీష్ శంకర్ పెద్ద అభిమాని. నిజానికి ‘మిరపకాయ్’ చేద్దామని పవన్ కు కథ వినిపించాడు హరీష్. కానీ అప్పుడు పవన్ ఒప్పుకోలేదు. తర్వాత పిలిచి ‘గబ్బర్ సింగ్’ అవకాశం ఇచ్చాడు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

8) ఎఫ్ 2(వెంకటేష్) :

అనిల్ రావిపూడి.. వెంకటేష్ కు వీరాభిమాని. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వంటి సినిమాలు చూసి వెంకీ కామెడీ టైమింగ్ కి పెద్ద ఫ్యాన్ అయ్యాడు.వెంకీ.. అనిల్ కు ‘ఎఫ్ 2’ సినిమా అవకాశం ఇచ్చాడు. అది బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘ఎఫ్3’ కూడా చేశాడు.

9) తేరి/మెర్సల్ /బిగిల్ :

విజయ్ కు అట్లీ పెద్ద ఫ్యాన్. విజయ్ తో ఎప్పటికైనా సినిమా చేయాలని భావించి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. మొదటి ప్రయత్నంగా ‘రాజా రాణి’ అనే లవ్ స్టోరీని తెరకెక్కించి హిట్ అందుకుని విజయ్ కు కథ చెప్పాడు. అలా ‘తేరి’ ‘మెర్సల్’ ‘బిగిల్’ వంటి హిట్ సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి.

10) విక్రమ్ :

లోకేష్ కనగరాజన్.. మన కమల్ హాసన్ కు పెద్ద అభిమాని. ‘విక్రమ్’ తో కమల్ ను ఏ రేంజ్లో ఎలివేట్ చేసాడో చూసాం.కమల్ కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చి తన అభిమానాన్ని చాటాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus