Poonam Kaur Marriage: పూనమ్ ‘కర్వాచౌత్’ ఫోటో పెద్ద చర్చకు దారితీసిందిగా..!

Advertisement

పూనమ్ కౌర్..పరిచయం అవసరం లేని పేరు. శ్రీకాంత్ నటించిన ‘మాయాజాలం’ చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలు పెట్టింది. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. తర్వాత సెకండ్ హీరోయిన్ అయ్యింది అలా కూడా క్లిక్ అవ్వలేదు. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది అలా అయినా ఈమెకు కలిసొచ్చింది లేదు. ఈమెకు ఉన్న ఫేస్ వాల్యూకి కచ్చితంగా మంచి హీరోయిన్ అవ్వాల్సిందే అని అంతా అంటుంటారు.కానీ లోపం ఎక్కడ జరిగిందో తెలియదు.

టాలెంట్ ఉన్న భామే. అయితే జనాలు ఈమెను ఇప్పటికీ గుర్తుంచుకోవడానికి ప్రధాన కారణం పవన్- త్రివిక్రమ్ లు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ వారి పై పరోక్షంగా సెటైర్లు వేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. త్వరలో ఈమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు.

తాజాగా ఈమె కర్వా చౌత్ పండుగను ఆచరించింది. అందుకు సంబంధించిన ఫోటోని కూడా షేర్ చేసింది. కర్వా చౌత్ అనేది ఉత్తరాది(నార్త్ ఇండియా) స్త్రీలు ఎక్కువగా ఆచరించే పండుగ. ఈ పండుగ విశిష్టత ఏంటి అంటే.. పెళ్ళైన మహిళలు పూర్ణిమ రోజున ఉపవాసం ఉండి, పార్వతీదేవిని పూజిస్తూ.. రాత్రి జల్లెడలో చంద్రున్ని చూసి.. అదే జల్లెడలో నుంచి భర్త మొహాన్ని చూస్తారు. ఆ తర్వాత భర్త ఆశీర్వాదాన్ని తీసుకుంటారు.

పెళ్లి కాని స్త్రీలు అయితే తమకు కాబోయే భర్తతో కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఈ వేడుకని నిర్వహిస్తారు. పూనమ్ కూడా జల్లెడ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న పిక్ పోస్ట్ చేసింది కాబట్టి..ఆమెకు పెళ్లైందా లేక పెళ్ళికి రెడీ అయ్యిందా? అనేది చర్చనీయాంశం అయ్యింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news