Poorna: ఘనంగా పూర్ణ ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • July 9, 2022 / 11:30 AM IST

శ్రీహరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శ్రీమహాలక్ష్మీ’ ,అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’, రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ.. హీరోయిన్ గా ఎక్కువ కాలం రాణించలేక పోవడం వల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది.’సిల్లీ ఫెలోస్’ ‘అఖండ’ ‘దృశ్యం 2’ వంటి చిత్రాల్లో ఈమె ప్రాముఖ్యమైన పాత్రలు పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే.

మరోపక్క బుల్లితెరపై చేసే షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. యూఏఈ కి చెందిన బిజినెస్మెన్ షానిద్‌ అసిఫ్‌ అలీని ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. అసిఫ్‌ అలీ జేబీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు సీఈఓ, ఫౌండర్‌ అన్న సంగతి తెలిసిందే. జమా అల్ మెహరి అనే సంస్థని కూడా స్థాపించి….కొత్త ఆఫీస్ లు ప్రారంభించడానికి కావలసిన సర్వీసులను ప్రొవైడ్ చేస్తున్నారు.

అంతేకాకుండా సెలబ్రిటీలకు యూఏఈ వీసాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. వీసా ప్రాసెసింగ్‌ అలాగే ఫ్లైట్‌ టికెటింగ్‌ వంటి పలు సర్వీసులను కూడా షానిద్‌ కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. కాజల్‌, ప్రియమణి, ప్రణిత, ఆండ్రియా, లక్ష్మీ, విజయ్‌ సేతుపతి, స్వేతా మీనన్‌, నాజర్‌, అజారుద్దీన్‌ వంటి సెలబ్రిటీలకు యూఎఈ వీసాలను ఏర్పాటు చేశారు. యూఏఈ ముస్లిం మత పెద్దలతో కూడా ఈయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. పూర్ణ-అసిఫ్‌ అలీ ఎంగేజ్మెంట్ నిన్న కేరళలో ఘనంగా జరిగింది..! తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది పూర్ణ. ఈ వేడుకలో షెమీ అఫీషియల్ వారు డిజైన్ చేసిన ఔట్ ఫిట్ లో చాలా అందంగా కనిపిస్తుంది పూర్ణ. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus