ఆ క్రేజీ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోదట..!

ఇటీవల కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలోనూ అలాగే ఫోన్లోనూ తనను వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది హీరోయిన్ షామ్నా కాశిమ్ అలియాస్ పూర్ణ. దివంగత నటుడు మరియు హీరో అయిన శ్రీహరి నటించిన ‘శ్రీమహాలక్ష్మీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పూర్ణ. ఆ తరువాత అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’ చిత్రంలో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించింది. అటు తరువాత రవిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ‘అవును’ ‘అవును2’ ‘లడ్డుబాబు’ చిత్రాలు కూడా ఈమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

మహేష్ బాబు ఆల్ టైం హిట్ అయిన ‘శ్రీమంతుడు’ చిత్రంలో కూడా ఈమె స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఇటీవల కొందరు వ్యక్తులు పెళ్లి పేరుతో మోసం చేశారని చెప్పుకొచ్చింది పూర్ణ. వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్ కారణంగా ఈమె సొంత ఊరు అయిన కేరళలోనే ఉంటూవస్తోన్న పూర్ణకు.. ఓ పెళ్లి సంబంధం వచ్చింది. ఈమె కుటుంబ సభ్యులు కూడా దీనికి అంగీకరించారు. అయితే తరువాత ఈమెకు సోషల్ మీడియాలో వేధింపులు మొదలయ్యాయి.

కొంతమంది ఫోన్లు కూడా చేసి కోటి రూపాయలు ఇవ్వాలని ఈమెను బెదిరించారట. దీంతో ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇస్తే.. ఆ పెళ్లి చూపులకు వచ్చిన గ్యాంగ్ అనే తేలింది. కొంతమంది సెలబ్రిటీలను టార్గెట్ చేసి మోసం చేసే గ్యాంగ్ ఇదని కూడా పోలీసులు తేల్చి పడేశారు. ఈ సంఘటనతో పూర్ణ చాలా హర్ట్ అయ్యింది. ‘జీవితంలో నేను పెళ్లే చేసుకోను’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది ఈ బ్యూటీ.

1

2

3

4

5

6

7

8

Suvarna Sundari Actress Poorna Black Dress Photos

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus