ఎస్.ఎస్.రాజమౌళి టాలీవుడ్ స్థాయిని అమాంతం పెంచేసిన దర్శకుడు. ఈయన పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి అయినప్పటికీ.. ఇండస్ట్రీలో కొంతమంది మాత్రం స్యూర్ సక్సెస్ రాజమౌళి(SURE SUCCESS RAJAMOULI) అని అంటుంటారు. ఎందుకంటే ఇతను తెరకెక్కించిన అన్ని సినిమాలు హిట్లే. అపజయమెరుగని దర్శకుడు అని కూడా అంటుంటారు. ఈయన ‘స్టూడెంట్ నెంబర్ 1′ సై’ వంటి క్లాస్ సినిమాలు తీసినా ‘మర్యాద రామన్నా’ వంటి ఫ్యామిలీ సినిమా తీసినా.. ‘సింహాద్రి’ ‘ఛత్రపతి’ ‘విక్రమార్కుడు’ వంటి మాస్ సినిమాలు తీసినా ‘యమదొంగ’ వంటి ఫాంటసీ బేస్ ఉన్న సినిమా తీసినా.. ‘ఈగ’ ‘బాహుబలి'(సిరీస్) వంటి విజువల్ వండర్స్ తెరకెక్కించినా అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ ను కూడా మెప్పిస్తుంటాడు.
సాధారణంగా కొన్ని సినిమాలు క్రిటిక్స్ ను మెప్పించినప్పటికీ.. ప్రేక్షకులను మెప్పించవు. అందుకే కమర్షియల్ గా కూడా అవి వర్కౌట్ అవ్వవు. కానీ రాజమౌళి సినిమాలు మాత్రం అందరినీ మెప్పిస్తుంటాయి. కమర్షియల్ గా కూడా కాసుల వర్షం కురిపిస్తుంటాయి. ఇదిలా ఉండగా.. ప్రఖ్యాత ఇంటర్నెట్ మూవీ డేటాబేస్(ఐ.ఎం.డి.బి) సంస్థ సినిమాలకు ఇచ్చే రేటింగ్స్ పై ప్రేక్షకులకు గట్టి నమ్మకం ఉంటుంది. రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ‘ఐ.ఎం.డి.బి’ నుండీ కూడా మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకున్నాయి. వాటిని ఓ లుక్కేద్దాం రండి :
1) స్టూడెంట్ నెంబర్ 1 : 6.8/10 రేటింగ్
2)సింహాద్రి : 7.4/10 రేటింగ్
3)సై : 7.4/10 రేటింగ్
4) ఛత్రపతి : 7.6/10 రేటింగ్
5)విక్రమార్కుడు : 7.7/10 రేటింగ్
6)యమదొంగ : 7.3/10 రేటింగ్
7)మగధీర : 7.6/10 రేటింగ్
8)మర్యాదరామన్న : 7.3/10 రేటింగ్
9)ఈగ : 7.7/10 రేటింగ్
10)బాహుబలి ది బిగినింగ్ : 8.1/10 రేటింగ్
11)బాహుబలి 2 : 8.2/10′ రేటింగ్