సంప్రదాయం ప్రకారం నటి పూర్ణ 7వ నెల ప్రెగ్నెన్సీ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • March 1, 2023 / 02:18 PM IST

నటి పూర్ణ త్వరలో తల్లి కాబోతున్నారు.. గతేడాది జూన్‌లో దుబాయ్ బేస్డ్ బిజినెస్‌మెన్ షానిద్ ఆసిఫ్ అలీతో ఆమె వివాహం జరిగింది.. అయితే కాస్త ఆలస్యంగా అక్టోబర్‌లో ఈ విషయం బయటపెట్టారు.. మోడల్‌గా, నటిగా, క్లాసికల్ డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ప్రస్తుతం గర్భవతి.. బేబి బంప్ నుంచి సీమంతం వరకూ తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన అన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్‌ని ఫ్యాన్స్, నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారామె..

రీసెంట్‌గా పూర్ణ మరికొన్ని పిక్స్, ఓ వీడియో షేర్ చేశారు.. ప్రస్తుతం ఆమెకు 7వ నెల రన్నింగ్.. వారి కేరళ సంప్రదాయం ప్రకారం 7వ నెలలో గర్భవతికి ఎలాంటి వేడుక చేస్తారో తెలియజేశారామె.. ఒక వైట్ క్లాత్‌ చుట్టి దానికి బ్లాక్ త్రెడ్‌తో టై చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు.. దీంతో పాటు తమ బంధువులతో కలిసి ఉన్న పిక్స్ కూడా పంచుకున్నారు.. ఈ ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అవి చూసిన వారు ‘‘గాడ్ బ్లెస్ యూ’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

 


 

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus