‘బిగ్ బాస్’ రియాలిటీ షో పై నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్..!

  • August 7, 2020 / 07:18 PM IST

మరో రెండు మూడు వారాల్లో ‘బిగ్ బాస్4’ మొదలు కాబోతుంది. ఈ సీజన్ ను కూడా ‘కింగ్’ నాగార్జునే హోస్ట్ చెయ్యబోతున్నారు. ఈ సారి మాత్రం ‘బిగ్ బాస్4’ ను 50 రోజులు మాత్రమే నిర్వహించబోతున్నారు అనే వార్తలు కూడా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ సారి ‘బిగ్ బాస్’ ఆఫర్ ను చాలా మంది సెలబ్రిటీలు రిజెక్ట్ చేశారనే టాక్ కూడా నడుస్తుంది. ఈ లిస్ట్ లో నటి ప్రగతి కూడా ఉంది.

ఈ విషయం పై ప్రగతి మాట్లాడుతూ.. “బిగ్ బాస్‌ కు వెళ్లే సెలబ్రిటీలు కేవలం రెండు కారణాలతోనే వెళ్తారు. ఒకటి పేరు కోసం.. రెండోది ఇప్పటి వరకూ వారి పై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవడానికి.! క్లియర్ గా చెప్పాలి అంటే..కొంతమంది ఎలాంటి నేమ్ అండ్ ఫేమ్ లేని వాళ్లు ‘బిగ్ బాస్‌’ కు వెళ్లి గుర్తింపు తెచ్చుకోవాలి అని వెళ్తుంటారు. మరికొందరు తమ పై ప్రేక్షకుల్లో ఉన్న చెడు అభిప్రాయాన్ని చెరిపేసుకోవడానికి వెళ్తుంటారు.

అయితే ఈ రెండింటి అవసరం నాకు లేదు.ఆల్రెడీ నాకు ఫేమ్ ఉంది.. ఎక్కడకు వెళ్లినా గుర్తిస్తారు. మంచి పేరు కూడా ఉంది.ఇక బిగ్ బాస్‌కి వెళ్లే పని ఏమీ ఉంది” అంటూ చెప్పుకొచ్చింది ప్రగతి. అయితే ప్రగతి చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు కూడా దారి తీశాయని చెప్పొచ్చు. గడచిన 3 సీజన్లు ‘బిగ్ బాస్’ కు వెళ్లిన కంటెస్టెంట్ లు ఫేమ్ లేని వాళ్ళు.. చెడ్డ పేరు ఉన్న వాళ్లేనా? అంటూ ప్రగతి పై కౌంటర్లు పడుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus