ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

సినిమా వాళ్లకు మాత్రమే కాదండోయ్.. సీరియల్స్ లో నటించే వాళ్లకు కూడా క్రేజ్ ఎక్కువే. సినిమాల్లో నటించే వాళ్ళు కేవలం సినిమా రిలీజ్ రోజైన శుక్రవారం నాడే కనిపిస్తారేమో..! కానీ సీరియల్ ఆర్టిస్ట్ లు ప్రతీరోజూ ప్రేక్షకులను పలకరిస్తుంటారు. కాబట్టి వీళ్ళని తమ కుటుంబ సభ్యులు లాగానే ఫీలవుతుంటారు ప్రేక్షకుల. ఇక వీళ్లకు పారితోషికాలు ఎంతెంత ఇస్తారు? అనే విషయాలు తెలుసుకోవాలని కూడా చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా సీరియల్స్ లో హీరోయిన్స్ నే ప్రధాన పాత్రలుగా చూపిస్తారు కాబట్టి.. వాళ్లకు ఎక్కువ పారితోషికం ఇస్తుంటారు. మరి ఎక్కువ పారితోషికం తీసుకునే 10 మంది బుల్లితెర క్రేజీ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) ప్రేమి విశ్వనాథ్ :

‘కార్తీక దీపం’ సీరియల్ తో వంటలక్కగా ఫేమస్ అయిన ప్రేమి విశ్వనాథ్.. ఒక్కో రోజుకి 30 వేలు అందుకుంటుందట.

2) సుహాసిని :

‘చంటిగాడు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాసిని.. ఆ తరువాత సినిమాల్లో క్లిక్ అవ్వకపోవడం వల్ల సీరియల్స్ లో నటిస్తూ వస్తుంది. ఈమె సీరియల్స్ షూటింగ్ లో పాల్గొనడానికి ఒక్కో రోజుకి 25వేలు అందుకుంటుందట.

3)పల్లవి రామిశెట్టి :

‘ఆడదే ఆధారం’ సీరియల్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ .. ఒక్కో రోజు షూటింగ్ కు 15 వేలు అందుకుంటుందట.

4)మంజుల :

‘చంద్రముఖి’ సీరియల్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజు షూటింగ్ కు 8 వేలు అందుకుంటుందట.

5)సమీరా షరీఫ్ :

సీరియల్స్ లో నటించడంతో పాటు యాంకర్ గా కూడా ఈ బ్యూటీ రాణిస్తుంది. ఒక్కో రోజు షూటింగ్ కు గాను ఈమె 10వేలు అందుకుంటుందట.

6)అషికా :

‘కథలో రాజకుమారి’ సీరియల్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజు షూటింగ్ కు గాను 12 వేలు అందుకుంటుందట.

7)  హరిత :

హీరోయిన్ రవళి చెల్లెలు హరిత కూడా సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈమె ఒక్కో రోజు షూటింగ్ కు గాను 12 వేలు అందుకుంటుందట.

8) ప్రీతీ నిగమ్ :

ఈమె పలు సినిమాల్లో కూడా నటించింది. ఇక ఇప్పటికీ సీరియల్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే ఉంది. ఈమె ఒక్కో రోజు షూటింగ్ కు గాను 10 వేలు అందుకుంటుందట.

9)నవ్య స్వామి :

‘నా పేరు మీనాక్షి’ ‘ఆమె కథ’ సీరియల్స్ తో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజు షూటింగ్ కు గాను 20 వేలు అందుకుంటుందట.

10)ఐశ్వర్య :

‘అగ్నిసాక్షి’ సీరియల్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజు షూటింగ్ కు గాను 25 వేలు అందుకుంటుందట.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus