ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!

  • August 2, 2022 / 02:25 PM IST

ఇప్పుడు ఓ సినిమా హిట్ అని చెప్పాలి అంటే కచ్చితంగా.. దాని థియేట్రికల్ రన్ ను పరిగణలోకి తీసుకునే చెప్పాలి. నిర్మాత ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత? ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్మారు? కలెక్షన్స్ పరంగా వచ్చిన షేర్ ను బట్టి.. సినిమా హిట్టా.. ప్లాపా అనేది డిసైడ్ చేస్తుంటారు ట్రేడ్ పండితులు. ఒకప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. సినిమా ఎన్ని రోజులు ఆడింది.. ఎన్ని కేంద్రాలలో ఆడింది అనే దాని పైనే సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేవారు.

ఇప్పుడున్న సదుపాయాలను బట్టి సినిమా ఎక్కువ రోజులు ఆడే పరిస్థితి లేదు. ఒక సినిమా.. రిలీజ్ అయిన 50 రోజులకే ఓటిటి సంస్థల్లో స్ట్రీమింగ్ చేసుకునేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇక మరో 10, 20 రోజులకు టీవీల్లో కూడా ప్రీమియర్ పడిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా 50 రోజులు ఆడటం చాలా కష్టం. అది కూడా పెద్ద సినిమాలకు మాత్రమే..! అది గ్రహించే డిస్ట్రిబ్యూటర్ లు కూడా తమ సినిమాకి ఎక్కువ థియేటర్స్ దక్కాలని ట్రై చేస్తుంటారు. అయితే మన టాలీవుడ్ లో .. అది కూడా థియేటర్స్ లో ఎక్కువ రోజులు ప్రదర్శింపబడిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో టాప్ 10 ఏంటో.. ఓ లుక్కేద్దాం రండి :

1)లెజెండ్:

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఆంధ్రప్రదేశ్ లోన.. సీడెడ్ కు చెందిన ప్రొద్దుటూరు అర్చన థియేటర్‌లో 1005 రోజులు ప్రదర్శింపబడింది.

2) మగథీర:

రాంచరణ్ – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఇండస్ట్రీ హిట్ ‘మగథీర’ చిత్రం.. కర్నూలు లోని ఓ థియేటర్లో 1001 రోజులు ప్రదర్శింపబడింది.

3) పోకిరి:

మహేష్ బాబు – పూరిజగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన మరో ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ చిత్రం కూడా.. కర్నూలు లోని ఓ థియేటర్లో 1000 రోజులు ప్రదర్శింపబడింది.

4) మంగమ్మ గారి మనవడు:

బాలకృష్ణ – కోడి రామకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం..కాచిగూడ లోని తారక రామ్ థియేటర్‌లో 567 రోజులు ప్రదర్శింపబడింది.

5) మరో చరిత్ర (1978):

కమల్ హాసన్ – కె. బాలచందర్ కాంబినేషన్లో తెరకెక్కిన క్లాసిక్ ‘మరో చరిత్ర’ చిత్రం కూడా అప్పట్లో ఓ థియేటర్లో 556 రోజుల ప్రదర్శింపబడింది.

6) ప్రేమాభిషేకం:

అక్కినేని నాగేశ్వరావు – దాసరి నారాయణ రావు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ ఆల్ టైం హిట్ చిత్రం.. గుంటూరు, వైజాగ్,విజయవాడ థియేటర్స్ లో 300 రోజులు ప్రదర్శింప బడ్డాయి.. అంతేకాదు ఓ థియేటర్లో అయితే 533 రోజులు ప్రదర్శింపబడింది కూడా.

7) లవకుశ:

ఎన్టీఆర్- సి.పుల్లయ్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ దృశ్యకావ్యం అప్పట్లో ఓ థియేటర్ లో 1111 రోజులు ప్రదర్శింపబడింది.

8) ప్రేమ సాగరం:

విజయ- టి.రాజేంద్ర కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం.. అప్పట్లో ఓ థియేటర్లో 465 రోజులు ప్రదర్శింపబడిందట.

9) వేటగాడు:

సీనియర్ ఎన్టీఆర్- కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ మరియు ఇండస్ట్రీ హిట్ చిత్రం అప్పట్లో ఓ థియేటర్లో 408 రోజులు ప్రదర్శింపబడింది.

10) అడవి రాముడు:

సీనియర్ ఎన్టీఆర్ – కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్లో తెరకెక్కిన మరో ఇండస్ట్రీ హిట్ ‘అడవి రాముడు’ కూడా ఓ థియేటర్లో 365 రోజులు ప్రదర్శింపబడింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus