Pragathi: వారెంత మంది వచ్చినా నాకు అవకాశాలు వస్తాయి: ప్రగతి

Advertisement

నటి ప్రగతి అందరికీ సుపరిచితమే. తల్లి, అత్త, వదిన,పిన్ని వంటి పాత్రలతో బాగా ఫేమస్ అయ్యింది.అయితే 2020 కోవిడ్ లాక్ డౌన్ కు ముందు ప్రగతి వేరు.. లాక్ డౌన్ తర్వాత ప్రగతి వేరు అని చెప్పాలి. ఎందుకంటే ఈమె రెండేళ్లలో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయింది. ఈమె లోని బోల్డ్ నెస్ ను బయటపెట్టి అందరికీ షాకిచ్చింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు, డాన్స్ వీడియోలు షేర్ చేసి యూత్ ను సైతం ఆశ్చర్యపరిచింది.

ఇక హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రగతి, చిన్నప్పుడు కార్టూన్ పాత్రలకు వాయిస్ ఓవర్ ఇచ్చేది. ఇక కాలేజీలో చదువుకునే రోజుల్లోనే హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ హీరోయిన్ గా ఈమె రాణించలేకపోయింది. తెలుగులో ఆమె మహేష్ బాబు నటించిన ‘బాబీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుండి ఈమె వరుస సినిమాల్లో సహాయ నటిగా రాణిస్తుంది.

తాజాగా ప్రగతి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె కొన్ని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. “నాది పెద్ద కటౌట్ కాబట్టి.. నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు లేరు.ఎక్కువ నాన్చను వెంటనే రియాక్ట్ అవుతాను. ఎవరేమన్నా అస్సలు ఊరుకోను, డోసు ఇచ్చేస్తా క్లాస్ పీకేస్తా. రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా చేస్తానని చెప్పడంతో టీనేజ్ లో హీరోయిన్ గా ఎక్కువ సినిమాల్లో చేయలేకపోయాను.

నిన్నటి తరం హీరోయిన్లు తల్లి పాత్రలు చేస్తున్నా.. అవి నాకు అడ్డంకి కాదు అని..! హీరోయిన్లకు తల్లిగా చేయడం అనేది కాంప్లిమెంట్ కావాలి. నేను అందగత్తెనే కాబట్టి నాకు కచ్చితంగా సినిమాలు వస్తాయి” అంటూ ఆమె బోల్డ్ నెస్ ను కాన్ఫిడెన్స్ ను మరోసారి బయటపెట్టింది ప్రగతి. ఇక ఈ ఎపిసోడ్ అక్టోబర్ 23 ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రసారం కానుంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!


ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus