Ori Devuda Review: ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విశ్వక్ సేన్, వెంకటేష్ (Hero)
  • మిథాలీ పాలేకర్, ఆశా భట్ (Heroine)
  • వెంకటేష్ కాకమాను తదితరులు (Cast)
  • అశ్వత్ మారిముత్తు (Director)
  • ప్రసాద్ వి.పొట్లూరి - దిల్ రాజు (Producer)
  • లియోన్ జేమ్స్ (Music)
  • విధు అయ్యన్న (Cinematography)
  • Release Date : అక్టోబర్ 21, 2022

తమిళంలో ఘన విజయం సొంతం చేసుకున్న “ఓ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా రూపొందిన తెలుగు చిత్రం “ఓరి దేవుడా”. విశ్వక్ సేన్, వెంకటేష్, మిథాలీ పాలేకర్, ఆశా భట్ కీలకపాత్రలు పోషించగా.. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన అశ్వత్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం విశేషం. మరి ఈ రీమేక్ తెలుగు ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: తాను ఇష్టపడిన అమ్మాయిని కాక.. తనను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని.. అర్ధం కాని ఇబ్బందులు, బాధలతో జీవితాన్ని సాగిస్తుంటాడు అర్జున్ (విశ్వక్ సేన్). ఇదేం జీవితంరా బాబు అని బాధపడుతున్న తరుణంలో అతనికి తన జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలెట్టే అవకాశం లభిస్తుంది. ఆ అవకాశాన్ని అర్జున్ ఎలా వినియోగించుకున్నాడు? రెండో అవకాశంతోనైనా ఆనందంగా ఉండగలిగాడా? అనేది “ఓరి దేవుడా” కథాంశం.

నటీనటుల పనితీరు: అర్జున్ గా విశ్వక్ సేన్ నటన బాగుంది. తనదైన శైలి బాడీ లాంగ్వేజ్ తోపాటు.. కాస్త సబ్టల్ బిహేవియర్ తో కొత్తగా కనిపించాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లోనూ అలరించాడు. నటుడిగా విశ్వక్ సేన్ కు మంచి ప్లస్ అయిన సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ మిథాలీ పాలేకర్ క్యూట్ గా ఆకట్టుకుంది. లిప్ సింక్ విషయంలో కాస్త ఇబ్బందిపడినా, హావభావాలతో మాత్రం యువతకు విశేషంగా ఆకట్టుకుంది.

ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు జనాలు ఫిదా అవ్వాల్సిందే. ఆశా భట్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. నటనతోనూ ఆకట్టుకుంది. దేవుడిగా వెంకీ మామ మాత్రం అదరగొట్టేశాడు. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ & కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ కడుపుబ్బ నవ్వాల్సిందే. వెంకీకి మంచి సపోర్ట్ ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అశ్వత్ తమిళ వెర్షన్ లో మిస్ అయిన అన్నీ తెలుగు వెర్షన్ లో యాడ్ చేశాడు. అందువల్ల ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ అయినప్పటికీ.. ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. విశ్వక్ సేన్ – మిథాలీ కెమిస్ట్రీ & విశ్వక్ సేన్ – ఆశా భట్ కామిబినేషన్ లో ఫన్ బాగా జనరేట్ అయ్యింది. సంగీతం, ఛాయాగ్రహణం & ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి. అయితే.. వీళ్ళందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసిన వ్యక్తి తరుణ్ భాస్కర్.

తనదైన శైలి సంభాషణలతో హిలేరియస్ ఫన్ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా విశ్వక్ సేన్ – వెంకీ కాంబినేషన్ సీన్స్ లో డైలాగ్స్ బాగా పేలాయి, అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా ప్రీచింగ్ కు తావు లేకుండా.. సింగిల్ లైన్ డైలాగులతో ఎమోషన్ ను ఎలివేట్ చేశాడు.

విశ్లేషణ: ఒరిజినల్ చూసినప్పటికీ.. బోర్ కొట్టించకుండా ఆడియన్స్ ను అలరించే చిత్రం “ఓరి దేవుడా”. అయితే.. ఎమోషనల్ కనెక్టివిటీ కాస్త మిస్ అవ్వడంతో, పాత్రధారులకు కానీ సినిమాకి కానీ జనాలు ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. ఆ ఒక్క మైనస్ ను పట్టించుకోకపోతే.. హ్యాపీగా ఒకసారి చూడదగ్గ సినిమాగా “ఓరి దేవుడా” నిలుస్తుంది.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus