Prince Review: ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 27, 2022 / 10:32 AM IST

Cast & Crew

  • శివకార్తికేయన్ (Hero)
  • మారియా (Heroine)
  • సత్యరాజ్ (Cast)
  • అనుదీప్ కె.వి (Director)
  • సునీల్ నారంగ్ - సురేష్ బాబు - పుస్కుర్ రామ్మోహన్ రావ్ (Producer)
  • తమన్ (Music)
  • మనోజ్ పరమహంస (Cinematography)

“జాతిరత్నాలు” చిత్రంతో భీభత్సమైన పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు అనుదీప్ కె.వి తెరకెక్కించిన తాజా చిత్రం “ప్రిన్స్”. శివకార్తికేయన్ టైటిల్ పాత్ర పోషించిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగు బైలింగువల్ అని ప్రమోట్ చేస్తున్నప్పటికీ.. తమిళ అనువాద చిత్రంలాగే ఉంది. మరి ఈ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: నిజానికి సినిమాలో ఇదీ కథ, ఇదీ కథనం, ఇదీ ట్విస్ట్ అని చెప్పడానికి ఏమీ లేదనే చెప్పాలి. ఆనంద్ (శివకార్తికేయన్)ను ఊరు మొత్తం వెలేస్తుంది. అందుకు అతడి తండ్రి విశ్వనాధం (సత్యరాజ్) కూడా అంగీకరించడం గమనార్హమవుతుంది. అసలు ఆనంద్ కథ ఏమిటి ? అతడ్ని ఎందుకు వెలి వేశారు? అనేది “ప్రిన్స్” కథ.

నటీనటుల పనితీరు: ఏ సినిమాలో అయినా హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగా వర్కవుటవుతుంది. కానీ ఈ చిత్రంలో శివకార్తికేయన్ & సత్యరాజ్ ల కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుటయ్యింది. వాళ్ళ కాంబినేషన్ కామెడీ అద్భుతంగా పండింది. మరియా అందం-అభినయంతో ఆకట్టుకుంది. ప్రేమ్ జీ & తదితర తమిళ నటులు ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: కథ లేకుండా, కథనంతో పని లేకుండా సినిమాని తెరకెక్కించడం అనేది మామూలు విషయం కాదు. అనుదీప్ కె.వి ఈ ఫీట్ రెండోసారి చేసి పర్వాలేదనిపించుకున్నాడు. నటుడిగా శివకార్తికేయన్ పనితనాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్న అనుదీప్.. కామెడీ పంచ్ డైలాగుల విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు.

అందువల్ల కామెడీ పూర్తిస్థాయిలో పండలేదు. క్లైమాక్స్ ఎపిసోడ్ ను కన్విన్స్ చేసిన విధానం బాగుంది. తమన్ తన సంగీతంతో సినిమాని బాగా ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాగున్నాయి.

విశ్లేషణ: లాజిక్ అనేది గాలికొదిలేసి, కథ-కథనాన్ని నేలకొదిలేసి, కేవలం పంచ్ డైలాగులు, సెన్స్ లేని కామెడీని ఎంజాయ్ చేయగలిగితే “ప్రిన్స్”ను విశేషంగా ఎంజాయ్ చేస్తారు. లేదంటే మాత్రం ఈ స్లాప్ స్టిక్ కామెడీని ఆస్వాదించడం కాస్త కష్టం.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus