Actress Pranitha: హాట్ టాపిక్ గా మారిన ప్రణీత లేటెస్ట్ కామెంట్స్..!

  • July 23, 2021 / 04:08 PM IST

సెలబ్రిటీలు ఎవరు పెళ్లి చేసుకున్నా సోషల్ మీడియాలో వాళ్ళు చేసే హంగామా మామూలుగా ఉండదు. తమ బెటర్ హాఫ్ తో వాళ్ళు రొమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజెన్లకు ఫీస్ట్ ఇస్తూ ఉంటారు. అంతేకాదు తన పార్ట్నర్ గురించి అన్ని విషయాలు బెస్ట్ బెస్ట్ అంటూ పేర్కొంటూ… నిజమైన ప్రేమని పొందాము అంటూ చెప్పుకొస్తుంటారు.వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సామాన్యులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంటారు.అయితే మన ప్రణీత మాత్రం తన మ్యారీడ్ లైఫ్ గురించి అంత అతి ఉత్సాహంతో చెప్పడం లేదు.

చాలా నార్మల్ గా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ… ‘పెళ్లి తర్వాత నా జీవితంలో డ్రాస్టిక్ ఛేంజెస్ ఏమీ రాలేదు. గతంలో ఎలా ఉన్నానో,ఇప్పుడు అంటే పెళ్లి తర్వాత కూడా అలానే ఉన్నాను.నా పెళ్లి టైమ్ కి 2 హిందీ సినిమాలకు సైన్ చేశాను.తర్వాత వాటిని పూర్తిచేసి, ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. అలాగే నా పెళ్లి కూడా హడావిడి హడావిడిగా అయిపోయింది.కాబట్టి కొత్తగా ఏం అనిపించలేదు.అలాగే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల నేను, నా భర్త నితిన్ రాజు..

ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండడం … తర్వాత నేను సినిమాలతో బిజీ అవ్వడం, ఆయన బిజినెస్ వ్యవహారాల్లో పడిపోవడంతో.. పెళ్లి సందడి అనేది ఎక్కడా ఆస్వాదించలేకపోయాను.మరోపక్క మా ఛారిటీ తరుపున సేవా కార్యక్రమాలు కూడా యధావిధిగా సాగిస్తున్నాము’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ప్రణీత.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus