Priya Anand: ఫ్యాన్స్ కు భారీ షాకిచ్చిన లీడర్ హీరోయిన్!

లీడర్ సినిమాతో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో ప్రియా ఆనంద్ ఒకరనే సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో నటించి ప్రియా ఆనంద్ పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. లీడర్ కాకుండా రామరామ కృష్ణకృష్ణ, 180, కో అంటే కోటి సినిమాలలో ప్రియా ఆనంద్ నటించారు. తెలుగులో ఆఫర్లు తగ్గడంతో ప్రియా ఆనంద్ తమిళ, కన్నడ సినిమాలపై దృష్టి పెట్టి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు.

అయితే తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిత్యానందను పెళ్లి చేసుకుంటానంటూ తాజాగా ప్రియా ఆనంద్ కామెంట్లు చేయగా ఆ కామెంట్ల గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని సినిమాలతో అనుబంధం ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో నిత్యానంద కోట్ లను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ప్రియా ఆనంద్ తరచూ నిత్యానంద పోస్ట్ లను షేర్ చేస్తుండగా ఒక ఇంటర్వ్యూలో ఈ పోస్ట్ లకు సంబంధించి ప్రశ్న ఎదురైంది.

ఆ ప్రశ్నకు ప్రియా ఆనంద్ స్పందిస్తూ నిత్యానంద అంటే తనకు ఇష్టమని అన్నారు. నిత్యానందకు ఉన్న ఛరిష్మా వల్లే వేల సంఖ్యలో ప్రజలు ఆయనను ఫాలో అవుతున్నారని ప్రియా ఆనంద్ చెప్పుకొచ్చారు. తాను నిత్యానందను పెళ్లి చేసుకుంటానని ఇద్దరి పేర్లలో నంద కామన్ గా ఉంది కాబట్టి పెళ్లి తర్వాత నా పేరును మార్చాల్సిన అవసరం అయితే ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రియా ఆనంద్ నటించిన సుమో, అందగన్, కాసేతన్ కడవులాడా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. ఇతర హీరోయిన్లకు భిన్నంగా నిత్యానంద గురించి గొప్పగా చెబుతూ ప్రియా ఆనంద్ వార్తల్లో నిలవడం గమనార్హం. దాదాపుగా 14 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్న హీరోయిన్లలో ప్రియా ఆనంద్ ఒకరు కావడం గమనార్హం. ప్రియా ఆనంద్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus