రాంగోపాల్ వర్మ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల సినిమా నిర్మాతలు అంతా నష్టాల భారిన పడితే.. ఈయన మాత్రం వారానికో సినిమా తీసి ఓటిటిలో టికెట్ రేటు పెట్టి మరీ విడుదల చేసాడు. ఆ సినిమాల్లో పెద్ద విషయం లేకపోయినప్పటికీ.. ఈయన చేసే వింత పబ్లిసిటీ వల్ల ప్రేక్షకులు టెంప్ట్ అయ్యి ఆ సినిమాలు చూసారు. అలా ఇతని సినిమాల వల్ల లాక్ డౌన్ లో కూడా కొంతమంది క్రేజ్ ను డబ్బుని సంపాదించుకున్నారు.
సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఈయన డైరెక్షన్లో వచ్చిన ‘రక్త చరిత్ర’ సినిమాలో నటించిన ప్రియమణి..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆర్జీవీ ప్రవర్తన గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ముఖ్యంగా సెట్లో ఆర్జీవీ ఎలా ప్రవర్తిస్తాడో ఇమిటేట్ చేసి మరీ చూపించింది. ఇక ప్రియమణి మాట్లాడుతూ.. “వర్మ సెట్‌లో ఉన్నప్పుడు.. మనం ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే కనబడతాడు. అందులో ఏదో టైప్ చేస్తున్నట్టు.. లేదా ఏదో చూస్తున్నట్టు..
చాలా బిజీగా కనిపిస్తుంటాడు. ఏదైనా సీన్ వివరించాల్సి వస్తే.. దానిని ఇంగ్లీష్‌లోనే చెబుతాడు. అయితే కట్ చెప్పిన తరువాత.. సీన్ బాగా వచ్చిందో లేదో చెప్పడు. దాంతో మనకే తెలుసుకోవాలని అనిపించి.. ‘ఒకసారి మానిటర్‌లో చూడొచ్చా’ అని ఆయన్ని అడిగితే.. ‘యా షూర్ చూడండి’ అని అంటాడు మళ్లీ వెంటనే ఫోన్ పట్టుకుని బిజీ అయిపోతాడు” అంటూ చెప్పుకొచ్చింది.
Most Recommended Video
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!