‘మహాసముద్రం’ లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ప్రియాంక అరుళ్ మోహన్..!

గతేడాది నాని హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రం పెద్దగా ఆడకపోయినా.. ఆ చిత్రం విడుదల సమయంలో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ గురించి మాత్రం ఎక్కువగా డిస్కషన్లు నడిచాయి. టాలీవుడ్లో హీరోయిన్లు తక్కువగా ఉన్న తరుణంలో.. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రంతో పరిచయం కాబోతున్న ప్రియాంక అరుళ్ మోహన్ అప్పట్లో యూత్ కు క్రష్ గా మారిపోయింది. అయితే సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈమెను దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు.

ఈ చిత్రంతో ప్రియాంక బిజీ హీరోయిన్ అయిపోతుంది అనుకున్న వాళ్ళ అంచనాలు కూడా కాస్త తప్పాయి.అయితేనేం కాస్త ఆలస్యం అయినప్పటికీ.. ప్రియాంక అరుళ్ మోహన్ కు ఇప్పుడు మంచి ఆఫర్లే వస్తున్నాయి. విషయం ఏమిటంటే.. ‘మహాసముద్రం’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తుండగా ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్నాడు.

 

ఈ చిత్రం ద్వారా సిద్దార్థ్ రీ ఎంట్రీ ఇవ్వబోతుండడం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం కథ మొత్తం ప్రియాంక అరుళ్ మోహన్ పాత్ర చుట్టూనే తిరుగుతుందట. ఈమె క్యారెక్టర్ కూడా బోల్డ్ గా ఉంటుందని సమాచారం. కచ్చితంగా ఈ చిత్రం ప్రియాంక అరుళ్ మోహన్ కు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంతో పాటు నితిన్ నటించబోతున్న ఓ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45


Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus