హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

వారసత్వం అనేది ఏ పరిశ్రమలో అయినా ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇవి ఎక్కువ హైలెట్ అవుతాయి. హీరో కొడుకు హీరో అవ్వడం, ప్రొడ్యూసర్ కొడుకు ప్రొడ్యూసర్ అవ్వడం లేదా హీరో అవ్వడం. డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవ్వడం మనం చూస్తూ వచ్చాము. అయితే మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం లేదా హీరో అవ్వడం, సింగర్ కొడుకు సింగర్ అవ్వడం ఇలా ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలో పని చేస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. మరి ఆ టెక్నీషియన్ లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) మణిశర్మ గారి అబ్బాయి మహాతి సాగర్.. తన తండ్రిబాటలోనే సంగీత దర్శకుడిగా మారి ‘ఛలో’ ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసాడు.

2) కీరవాణి గారి అబ్బాయి కాల భైరవ కూడా తన తండ్రీ లానే సంగీత దర్శకుడిగా మారి ‘మత్తు వదలరా’ సినిమాకి పనిచేసాడు.

3) కీరవాణి గారి చిన్నబ్బాయి.. సింహా కోడూరి ‘మత్తు వదలరా’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు.

4) దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ కూడా సింగర్ గా మారి ఎన్నో పాటలు పాడాడు.చెప్పాలంటే తన అన్న దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సినిమాల్లోని పాటలకే పాడాడు.

5) ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారి సోదరి శైలజ కూడా సింగర్ గా మారి ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. ‘నిన్నే పెళ్ళాడతా’ ‘మురారి’ వంటి సినిమాల్లో హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పింది కూడా ఈమెనే..!

6) ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి ఎస్.పి.చరణ్ కూడా ‘మన్మధుడు’ లో ‘నేను నేనుగా లేను’, ‘వర్షం’ లో ‘మెల్లగా కరగనీ’ వంటి పాటలు పాడారు.

7) లిరిసిస్ట్ వెన్నెల కంటి గారి అబ్బాయి రాకెండు మౌళి కూడా నటుడు గా, సింగర్ గా, లిరిసిస్ట్ గా రాణిస్తున్నాడు.

8) ఎం.ఎం.కీరవాణి గారి సోదరుడు కళ్యాణి మాలిక్ అలియాస్ కళ్యాణి కోడూరి కూడా సంగీత దర్శకుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

9) ఎం.ఎం.కీరవాణి గారి సోదరి ఎం.ఎం.శ్రీలేఖ గారు కూడా సంగీత దర్శకురాలిగా పనిచేశారు.

10) ఎం.ఎం.కీరవాణి గారి భార్య శ్రీవల్లి గారు బాహుబలి 1, 2 సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు రూపొందుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు.

11) సింగర్ సునీత గారి అమ్మాయి శ్రేయ కూడా సింగర్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus