వర్జినిటీ గురించి స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్ !

ఓ బాలీవుడ్ హీరోయిన్ వర్జినిటీ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె మరెవరో కాదు ప్రియాంక చోప్రా (Priyanka Chopra). బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, ప్రస్తుతం గ్లోబల్ బ్యూటీ అయినప్పటికీ ఈమె తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే అని చెప్పాలి. ఎందుకంటే ఈమె టాలీవుడ్ హీరో రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి ‘తుఫాన్’ (Zanjeer)  అనే సినిమాలో నటించింది. అలాగే ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu)  – రాజమౌళి  (S. S. Rajamouli) కాంబినేషన్లో రూపొందే సినిమాలో కూడా నటించబోతుంది. అయితే అది ఏ పాత్ర అనేది ఇంకా రివీల్ కాలేదు.

Priyanka Chopra

ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. “చాలా మంది మగవాళ్ళు తమకు కాబోయే భార్య వర్జిన్ గా రావాలని కోరుకుంటారు. అలాంటి వాళ్లకు నేను ఒక్కటే చెబుతున్నా…! వర్జినిటీ కంటే ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. వర్జినిటీ ఒక్క రాత్రిలోనే పోతుంది. దాన్ని ప్రధానంగా చేసుకోకూడదు. దానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. మీకు వచ్చే భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోగలగాలి.

మంచైనా, చెడైనా ఒకరి మొహం పై కనిపించదు. ఒక అబ్బాయిని నమ్మిన అమ్మాయి ఏదైనా చేసేస్తుంది. కానీ అలా కలిసిన ప్రతి జంట.. పెళ్లి పీటలు ఎక్కుతుంది అనే గ్యారెంటీ లేదు. అందుకు అదృష్టం కూడా ఉండాలి. అది కుదరని పక్షంలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వర్జినిటీ గురించి ఆలోచించకూడదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక ప్రియాంక చోప్రా 2018లో హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ సినిమా తెచ్చిన సమస్య నుండి దిల్ రాజు బయటపడినట్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus