2022 లో ఓటీటీలో సైలెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ హిట్ గా నిలిచింది ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station). హెబ్బా పటేల్ (Hebah Patel), వశిష్ట సింహా (Vasishta N. Simha).. ఇందులో జంటగా నటించారు. సాయి రోనాక్ (Sai Ronak), పూజిత పొన్నాడ (Poojita Ponnada) వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. అశోక్ తేజ (Ashok Teja) దీనికి దర్శకుడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఊర్లో చాకలిగా పనిచేసే రాధా తన భర్త తిరుపతితో కలిసి నివసిస్తూంటుంది. కానీ ఆమె భర్తకు రాధ.. సుఖం ఇవ్వదు. ‘బాగా చదువుకుంటున్న తనని..
నీ లాంటి పనికిరాని వాడికి ఇచ్చి పెళ్లి చేశారు’ అనేది ఆమె అభిప్రాయం. అలాగే తిరుపతికి ఏదో ఒక వంక పెడుతూనే ఉంటుంది. అందువల్ల ఆమెతో అతను సరిగ్గా కాపురం చేయలేడు. దీంతో అతను సంసారానికి పనిచేయడు అని ఆమె ఫిక్స్ అవుతుంది. దీంతో మనోవేదనకు గురైన తిరుపతి.. ఆ ఊర్లో ఆడవాళ్ళని చెరుపుతూ.. వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఒక మృగంలా మారిపోతాడు. చివరి వరకు ఈ విషయం రాధకి తెలీదు.
ఆ తర్వాత విషయం తెలుసుకున్న రాధ.. తిరుపతిని నరికి చంపేస్తుంది. అక్కడితో ఆ సినిమా కథ అయిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ చనిపోయిన తిరుపతి ‘అరుంధతి’ లో పశుపతిలా ప్రేతాత్మగా మారి ఆ ఊరి వాళ్ళని చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు ‘ఓదెల 2’ (Odela 2) టీజర్లో చూపించారు. అయితే ఇందులో తమన్నా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఆమె శివశక్తిగా కనిపించబోతుంది.
కానీ ఆమె బ్యాక్ స్టోరీ ఏంటి? ఓదెల జనాలని తిరుపతి ఆత్మ నుండి ఎలా కాపాడింది? రాధ(హెబ్బా పటేల్) ఏమైపోయింది? అనే సస్పెన్స్ తో టీజర్ ను కట్ చేశారు. ఇందులో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంది. అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ టీజర్ కి హైలెట్ అని చెప్పొచ్చు. మీరు కూడా లేట్ చేయకుండా టీజర్ ను ఓ లుక్కేయండి :