Actress Raashi: ‘నిజం’ సినిమాలో నా పాత్ర నాకే నచ్చలేదు: రాశీ

  • February 19, 2022 / 11:34 AM IST

సీనియర్ హీరోయిన్ రాశీ .. అందరికీ సుపరిచితమే. బాలనటిగా విజయ పేరుతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశీ.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషల సినిమాల్లో కూడా నటించింది. ‘పెళ్లి పందిరి’ సినిమాతో ఈమె రాశీ గా కంప్లీట్ హీరోయిన్ గా మారింది.ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ‘గోకులంలో సీత’ సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇక ‘శుభాకాంక్షలు’ ‘ప్రేయసి రావే’ ‘స్నేహితులు’ వంటి సినిమాలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

తరువాత కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈమెకు డిమాండ్ తగ్గింది. ఇదిలా ఉండగా.. ఈమె మహేష్ బాబు ‘నిజం’ సినిమాలో చేసిన పాత్రకు ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆ సినిమాలో గోపీచంద్ తో మితి మీరిన రొమాన్స్ కలిగిన సన్నివేశాలే.. ఆ విమర్శలకు కారణం అని చెప్పొచ్చు. చాలా షోలలో ఈ పాత్ర ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో రాశీ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇటీవల ఈమె ‘రాశి విజన్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను స్థాపించి అందులో తన సినీ కెరీర్ కు సంబంధించిన కీలక విషయాల గురించి చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ఈమెను ‘నిజం’ సినిమాలో అంత ఘాటు రొమాన్స్ కలిగిన సన్నివేశాల్లో ఎందుకు నటించారు? అని కామెంట్లు పెట్టారు. దానికి ఈమె సమాధానం ఇస్తూ.. “దర్శకుడు తేజ.. ‘నిజం’ సినిమాలో నా పాత్ర గురించి చెప్పిందొకటి.. అక్కడ చూపించింది మరొకటి. అందుకే అలాంటి బోల్డ్ పాత్రలో కనిపించాను. మొదటి నుండీ ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశాను” అంటూ చెప్పుకొచ్చింది రాశీ.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus