ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరితోనూ మనం, ప్రత్యేకంగా ఎందుకు ఆలోచించాలి అని గుంపులో గోవిందం అయిపోతుంటారు కొందరు. అయితే అలా కాకుండా సమస్యను పది మంది దృష్టికి తీసుకెళ్లి సమస్యను అధిగమించేలా చూస్తుంటారు మరికొందరు. ఈ రెండో రకానికి చెందిన వ్యక్తే రాధికా ఆప్టే. భారతీయ సినిమాల గురించి పరిచయం ఉన్న వాళ్లకు ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రలు ఆమెకు చాలా ఈజీ. అయితే ఇటీవల జరిగిన ఓ ఘటన ఆమెను ఇబ్బందిపెట్టింది.
రాధికా ఆప్టే ఇటీవల ఒక ఎయిర్‌పోర్టులో చాలా ఇబ్బందులను ఎదుర్కుంది. అయితే సైలెంట్‌గా ఉండకుండా ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతోపాటు అక్కడ ఏం జరిగింది అనే వివరాలను కూడా ఆ పోస్టులో రాసుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా ఇండిగో ఫ్లైట్ టీమ్ వల్లనే అని చెప్పింది రాధిక ఆప్టే.
మాకు ఉదయం 8.30కు ఫ్లైట్ ఉంది. ఇప్పుడు సమయం 10.50 అవుతోంది. ఫ్లైట్‌లోకి ఇంకా ప్రయాణికులను ఎక్కించలేదు. కానీ ప్రయాణికులు విమానంలోకి వెళ్తున్నట్లు టీమ్ చెబుతోంది. ప్రయాణికులను ఏరో బ్రిడ్జ్‌లో పెట్టి లాక్ చేశారు. దాదాపు గంట నుండి ఇందులోనే లాక్ అయిపోయాం. సెక్యూరిటీ డోర్లను ఓపెన్ చేయడం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ ఐడియా లేదు. ఫ్లైట్ క్రూ కూడా విమానంలోకి వెళ్లినట్లు లేరు అని రాసుకొచ్చింది రాధికా ఆప్టే.
ఫ్లైట్‌లోకి కొత్త క్రూ డ్యూటీ ఎక్కాల్సి ఉంది. కానీ వారు ఎప్పుడు వస్తారు అనేది తెలియడం లేదు. మధ్యాహ్నం 12 వరకు మేం ఇక్కడే ఉండాల్సి వస్తుందని అంటున్నారు. తాగడానికి నీళ్లు లేవు, బాత్రూమ్కు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఈ ఫన్ రైడ్‌కు థ్యాంక్స్ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది (Radhika Apte) రాధిక. అయితే తర్వాత ఏమైంది అనేది ఇన్‌స్టాలో షేర్ చేయలేదు.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!