Raiza Wilson: పాతాళ గంగ అవతారం ఎత్తిన రైజా విల్సన్‌.. ఫోటోలు వైరల్!

Advertisement

నటీమణులు తమ అందమైన ఫోటోలను మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు. లేదు అంటే సింపతీ కోసం కొన్ని డల్ ఫోటోలు షేర్ చేసి.. వార్తల్లో ఉండాలని చూస్తుంటారు. అయితే ఓ నటి ఏడుస్తున్న ఫోటోలు షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. ఆమె మరెవరో కాదు తమిళ నటి రైజా విల్సన్. శుక్రవారం నాడు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ‘ఏడుస్తూ తీసుకున్న ఫోటోలు షేర్ చేసింది’ .

దీంతో ఆమె (Raiza Wilson) ఇలాంటి ఫోటోలు ఎందుకు షేర్ చేసింది అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ‘శుక్రవారం పూట మహాలక్ష్మి లాంటి మీరు ఎందుకు ఏడుస్తున్నారు?’ అంటూ కొంతమంది అతి సింపతీ కురిపించారు. మరికొంతమంది అయితే కష్టాల గురించి బాధల గురించి చెబుతూ.. ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. సెలబ్రిటీలు కూడా ఈ ఫోటోల పై స్పందించారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ స్పందిస్తూ.. ‘‘నీవు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.

మేమంతా నీతో ఉన్నాము’’ అంటూ రాసుకొచ్చాడు. హీరోయిన్‌ మంజిమా మోహన్‌ స్పందిస్తూ.. ‘‘ ఏడవడం కూడా మనకు ఏమి చేసి పెట్టదు. ధైర్యంగా ఉండు’’ .ఇక నటి ఫరినా ఆజాద్‌ స్పందిస్తూ.. ‘‘ ఏమీ కాదు’’ అన్నాడు. రైజా విల్సన్‌ ‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’..‘కాఫీ విత్‌ కాదల్‌’ వంటి సినిమాలతో పాపులర్ అయ్యింది. ‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈమె నటనకు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు కూడా దక్కింది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus