సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో రంభ ఎంపిక చేసిన పాత్రల్లో మాత్రమే నటిస్తూ ప్రశంసలతో పాటు విజయాలను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఒక సందర్భంలో రంభ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. రంభ వీడియోలో ఏంటి దేవుడా ఏంటసలు అంటూ కామెంట్లు చేశారు. కూర బాగుందని ఒక ముద్ద ఎక్కువగా తింటే ఎక్కడ బడితే అక్కడ ఒళ్లు పెంచేస్తున్నావని అమె చెప్పుకొచ్చారు.
నీకు అంత ఇష్టం ఉంటే నా జుట్టు పెంచాలని అలా పెంచితే సంతోషిస్తానని రంభ కామెంట్లు చేశారు. ఇంకా ఇష్టమైతే కలర్ పెంచాలని ఇంకా సంతోషిస్తానని రంభ అభిప్రాయం వ్యక్తం చేశారు. నీకు అంతగా ప్రేమ ఎక్కువైతే నా ఆయుష్షు పెంచాలని రంభ కామెంట్లు చేశారు. జీవితం ఎంజాయ్ చేస్తానని అంతేకానీ ఎక్కడబడితే అక్కడ పెంచేస్తున్నావని రంభ అన్నారు. ఏం తిన్నది అన్నమే కదా ఇష్టపడి తిన్నానని ఏయ్యా కష్టపెడుతున్నావు..
ప్లీజ్ అర్థం చేసుకో.. ప్లీజ్ ప్లీజ్ స్వామి.. ఎక్కడ బడితే అక్కడ నా ఒళ్లు పెంచవద్దు స్వామి… ప్లీజ్” అని రంభ అభిప్రాయం వ్యక్తం చేశారు. రంభ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. రంభ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
సినిమా సినిమాకు రంభ క్రేజ్ ను పెంచుకోవడంతో పాటు సక్సెస్ రేట్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ట్విట్టర్ లో 19 వేల మంది రంభను ఫాలో అవుతున్నారు. రంభ మాత్రం కేవలం 12 మందిని మాత్రమే ఫాలో అవుతుండటం గమనార్హం. స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలకు రంభ ఓకే చెప్పాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
My daily routine prayer to God pic.twitter.com/dXHDj7CNLM
— Rambha Indrakumar (@Rambha_indran) September 22, 2023
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!