Priyanka Jain: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ సీజన్ 7 ‘ నిన్ననే అంటే సెప్టెంబర్ 3 న ఆదివారం నాడు స్టార్ట్ అయ్యింది. ఈ రియాలిటీ షోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్ ను కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ సీజన్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. ప్రతి సీజన్లో 16 మంది కంటెస్టెంట్ల వరకు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ ఈ సీజన్లో అలాంటిది రిపీట్ కాలేదు. అందుకే ఉల్టాపల్టా అంటూ ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది హింట్ ఇచ్చింది ‘బిగ్ బాస్’ యూనిట్.

ఇక ఈసారి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ముగ్గురు, నలుగురు తప్ప పెద్దగా జనాలకి తెలిసిన వారు కాదు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఈ 14 మంది కంటెస్టెంట్స్ లో మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక జైన్.’స్టార్ మా’ లో ప్రసారమవుతున్న ‘జానకి కలగనలేదు’ సీరియల్ తో ఈమె బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈమె (Priyanka Jain) గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) 1998 వ సంవత్సరంలో జూలై 2 న ముంబైలో జన్మించింది. అయితే పెరిగింది మొత్తం బెంగళూరులో..!

2) ఈమె జైన్ కుటుంబానికి చెందిన అమ్మాయి.

3) ప్రియాంక జైన్ తండ్రి పేరు మనోజ్ ఎస్ జైన్, తల్లి పేరు ఫల్గుని జైన్. ఈమెకి తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు జెనిల్ ఎం జైన్

4) ప్రియాంక జైన్ కి ప్రతీక్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కొంతకాలంగా అతనితో ప్రేమలో ఉంది అని తెలుస్తుంది.

5) ప్రియాంక జైన్ కి చిన్నప్పటి నుండి నటన పై ఆసక్తి ఉంది. కానీ ఇంట్లో వాళ్ళకి బయపడి ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోయింది.

6) 2015 వ సంవత్సరంలో ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో రూపొందిన ‘రంగి తరంగ’ ఈమె మొదటి సినిమా కావడం విశేషం.

7) కన్నడ ఇండస్ట్రీలో ఈమె ‘గోలీసోడా’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా ఆమె సక్సెస్ కాలేకపోయింది.

8) కొన్నాల్టికి టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. 2018 వ సంవత్సరంలో వచ్చిన ‘చల్తే చల్తే’ అనే చిత్రంతో ఈమె టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అటు తర్వాత ‘వినరా సోదర వీర కుమార’ ‘ఎవడు తక్కువ కాదు’ వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.

9 ) అంతేకాకుండా ‘సితార’ ‘సోచ్’ వంటి సినిమాల్లో కూడా ఈమె నటించింది.

10 ) ‘మౌనరాగం’ సీరియల్ తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ‘జానకి కలగనలేదు’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

11 ) ప్రియాంక జైన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 4 లక్షలకి పైగా ఫాలోవర్స్ సంఖ్య ఉంది. కాబట్టి… ఈమె బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి.

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus