Damini Bhatla: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘బిగ్ బాస్ సీజన్ 7 ‘ రెండు రోజుల క్రితం అంటే సెప్టెంబర్ 3 న ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమైంది. బిగ్ బాస్ తెలుగులో కూడా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ షోకి ఫ్యాన్స్ కూడా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక 7 వ సీజన్ మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. మొదటి వారం లేదా రెండో వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండే అవకాశం ఉంది. ఈ సీజన్ ను కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ సీజన్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. ప్రతి సీజన్లో 16 మంది కంటెస్టెంట్ల వరకు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందుకే ఉల్టాపల్టా అంటూ ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది ముందుగానే హింట్ ఇచ్చింది ‘బిగ్ బాస్’ యూనిట్.

ఇక కంటెస్టెంట్ లు కూడా ఓ 3 , 4 మంది తప్ప మిగిలిన వాళ్ళు జనాలకి పెద్దగా పరిచయం ఉన్న వ్యక్తులు కాదనే చెప్పాలి. ఆ విషయాలను పక్కన పెట్టేస్తే.. హౌస్ లోకి 3 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది దామిని భట్ల. ఎంట్రీలోనే బిగ్ బాస్ పెట్టిన సిల్వర్ బ్రీఫ్ కేస్ ని రిజెక్ట్ చేసి విన్నర్ అవ్వడానికే వచ్చానని ఈమె చెప్పింది. మరి గేమ్ ఎలా ఆడుతుందనేది తర్వాతి విషయం. ఇక ఈమె (Damini Bhatla) గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) దామిని భట్ల.. ఈమె తెలుగమ్మాయే. 1996 వ సంవత్సరం జూలై 4 న ఈమె జన్మించింది. ఈమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజమండ్రి.

2) దామిని భట్ల తండ్రి పేరు సి. హెచ్ .రాధాకృష్ణ . తల్లి పేరు సి.హెచ్. ఝాన్సీ

3) దామిని మొదట కర్ణాటక మ్యూజిక్ లో శిక్షణ పొందింది. అఖుండ సత్యవతి గారి వద్ద ఈమె శిక్షణ పొందినట్టు తెలుస్తుంది. అటు తర్వాత ఈమె రాజమండ్రి నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడం జరిగింది.

4) మొదట కోటి వంటి సంగీత దర్శకులు నిర్వహించిన పలు మ్యూజిక్ షోలలో ఈమె పాల్గొంది.

5) మరోపక్క జీ వారి ‘స రి గ మ ప లిటిల్ ఛాంప్స్’ ‘పాడుతా తీయగా ‘ వంటి సింగింగ్ షోలలో కూడా పాల్గొని మెప్పించింది.

6) 2014 నుండి ఈమె సినిమాల్లో పాటలు పాడటం మొదలు పెట్టింది. ‘లవ్ ఇన్ లండన్’ ‘బాహుబలి ది బిగినింగ్’ ‘మనమంతా’ ‘పడేసావే’ ‘నిర్మల కాన్వెంట్’ వంటి సినిమాల్లో ఈమె పాటలు పాడింది.

7) ‘బాహుబలి ది బిగినింగ్’ సినిమాలో ఈమె పాడిన ‘పచ్చబొట్టేసిన పాట’ చార్ట్ బస్టర్ అయ్యి ఈమె ఇమేజ్ ను పెంచింది.

8) దామిని సోదరి మౌనిమ కూడా సింగరే..!

9) కొన్నాళ్లుగా దామిని భట్లకి సింగింగ్ అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. దానికి కారణాలు ఏంటి అన్నది కూడా ఎవ్వరికీ తెలీదు.

10) గత 3 సీజన్లుగా బిగ్ బాస్ కి వెళ్లాలని దామిని భట్ల ప్రయత్నిస్తుంది. ఫైనల్ గా ఇప్పటికి ఆమెకు ఆ అవకాశం వచ్చింది. మరి ఇక్కడ ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus