తెలుగు తెరపై అగ్ర హీరోలందరి సరసన నటించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ. అప్పట్లో యూత్ అందరికీ కలల యువరాణి ఆమె. గ్లామరస్ రోల్స్ లో రంభను కొట్టేవారే లేరన్నట్లుగా నటించేది. అయితే వివాహం అనంతరం సినిమాలకు దూరం అయిన ఈ భామ త్వరలోనే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపద్దుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది.
ఈ మధ్య నిన్నటితరం కథానాయికలు చాలా మంది రీఎంట్రీ ఇచ్చి సినిమాల్లో బిజీ అయిపోతున్నారు. ఈ క్రమంలో రంభ కూడా తన వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకొని తెలుగు తెరపై మరోసారి తన హవా కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తోంది. గతంలో రెండు, మూడు సార్లు ఆమెకు ఆఫర్స్ వచ్చినా.. తిరస్కరించింది. రీసెంట్ గా అల్లరి నరేష్ హీరోగా ‘ఆ ఒక్కటే అడుగుతా’ అనే సినిమాను ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాకు కొనసాగింపుగా చేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కు అత్త పాత్రలో రంభను సంప్రదించే అవకాశాలు ఉన్నాయి.