Ramya Krishna: ఆహా డాన్స్ ఐకాన్ జడ్జిలుగా రమ్యకృష్ణ శేఖర్ మాస్టర్!

Advertisement

డిజిటల్ మీడియాలో ఎన్నో ఓటీటీ సంస్థలు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో మంచి ఆదరణ పొందాయి అయితే ఈ ఓటీటీ సంస్థలకు పోటీగా తెలుగు ఓటీటీ ఆహా ద్వార కూడా ఎన్నో సినిమాలు, వెబ్ వెరీస్ లు సింగింగ్ కాంపిటీషన్స్ డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలను ప్రసారం చేసిన ఆహా మొట్టమొదటిసారిగా డాన్స్ ఐకాన్ పేరిట డాన్స్ షో ప్రారంభించానున్నారు.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమానికి ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇక ఇందులో శ్రీముఖి యష్ మోనాల్ గజర్ మెంటర్స్ గా ఉండగా ఆరుగురు ప్రొడ్యూసర్లు ఇందులో ఇద్దరు కంటెస్టెంట్లను ఆక్షన్ పద్ధతి ద్వారా ఎంచుకోవలసి ఉంటుంది. ఇకవీరిలో ఒక్కొక్కరికి ఒక్కొ కొరియోగ్రాఫర్ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఎవరైతే గెలుస్తారో వారు స్టార్ హీరోకి కొరియోగ్రఫీ చేసే అవకాశం అందుకుంటారు.

ఇక ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమానికి లేడీ సూపర్ స్టార్ వెండితెర శివగామి రమ్యకృష్ణ న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె మొదటిసారి ఇలా డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న ఒక డాన్స్ షో కి న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తున్నారు.

ఇక రమ్యకృష్ణతో పాటు శేఖర్ మాస్టర్ సైతం ఈ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది. ఇక ఈ కార్యక్రమానికి మొదటి రోజు విజయ్ దేవరకొండ అనన్య పాండే ముఖ్య అతిథులుగా హాజరైనట్టు ప్రోమోలో చూపించారు. మరి మొదటిసారి ఆహాలో ప్రసారమవుతున్న ఈ డాన్స్ షో ఎలాంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news