‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!

  • September 2, 2022 / 08:25 PM IST

‘ఉప్పెన’ తో బ్లాక్ బస్టర్ కొట్టి రికార్డులు క్రియేట్ చేసిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్.. రెండో చిత్రం నుండి ఆ ఊపుని కొనసాగించలేకపోతున్నాడు అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘కొండపొలం’ ప్లాప్ అయ్యింది. ఇక మూడో చిత్రంగా ‘రంగ రంగ వైభవంగా’ చేశాడు. అర్జున్ రెడ్డిని తమిళంలో రీమేక్ చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ‘తెలుసా తెలుసా’ వంటి పాటలు సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా చేశాయి. అయితే ఈరోజు అంటే సెప్టెంబర్ 2న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వస్తుంది. చాలా చోట్ల థియేటర్లు ఖాళీ అయిపోవడం గమనార్హం. ఈ చిత్రానికి ప్లాప్ టాక్ రావడానికి గల కారణాలు లేదా మైనస్ లు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ముందుగా కథే పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి. హీరో వైష్ణవ్ తేజ్.. ఈ కథను ఎలా ఓకే చేశాడు అనే ప్రశ్న సినిమా స్టార్టింగ్ నుండి వెంటాడుతూనే ఉంటుంది. సినిమా ఆరంభంలోనే ‘నిన్నే పెళ్లాడతా’ పోస్టర్ చూపిస్తాడు దర్శకుడు. ఆ సినిమా దగ్గరనుండి ‘నువ్వే కావాలి’ ‘ఖుషి’ ‘ఆనందం’ ‘నువ్వు లేక నేను లేను’ ‘100% లవ్’ ‘రంగ్ దే’ చివరికి ‘రామ రామ కృష్ణ కృష్ణ’ వంటి సినిమాల ఛాయలు కూడా కనిపిస్తాయి.వైష్ణవ్ కు అనుభవం లేకపోవడం వల్లనో ఏమో ఇలాంటి కథను ఎంపిక చేసుకున్నాడు.

2) పోనీ కథ కొత్తగా ఉండాల్సిన లేదు. ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు కొత్త కథలతో రూపొందుతున్నవి కావు .కనీసం టేకింగ్ అయినా కొత్తగా, ఆకట్టుకునే విధంగా ఉంటే సినిమాని ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగానే ఉన్నారు.

3)కథే మైనస్ అనుకుంటే.. ఆ కథకు మించిన బడ్జెట్ పెట్టారు. టేకింగ్ పెద్దగా ఆకట్టుకునే విధంగా లేకపోగా.. నిర్మాతల్ని కూడా వేలెత్తి చూపే విధంగా ఉన్నాయవి..!

4)ఇక కామెడీ విషయానికి వస్తే చాలా సిల్లీగా ఉంది. ఆ కామెడీ సీన్లు వచ్చిన ప్రతీసారి ప్రేక్షకులు ఫోన్ ల వంక చూడటం మొదలుపెడతారు. సత్య కామెడీ సీన్స్ వచ్చినప్పుడు మనకి ‘వెంకీ’ లో బ్రహ్మానందం ట్రాక్ గుర్తుకొస్తుంది. అయితే ఈ సీన్లు వెంటనే తేలిపోతాయి.

5)హీరో బాగా పెర్ఫార్మ్ చేశాడు. కానీ హీరోయిన్ విషయంలో మాత్రం రాంగ్ సెలక్షన్ అని చెప్పాలి. ఓ పాటలో స్కిన్ షో చేసింది కానీ ఆ పాత్రకు ఆమె పలికించిన హావభావాలు.. ఆమెతో పాటు సగటు ప్రేక్షకులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి.

6) కథ మరీ పేలవంగా ఉంది అనే థాట్ రాకుండా.. నవీన్ చంద్ర క్యారెక్టర్ ను పెట్టి డైవర్ట్ చేయాలి అనుకున్నాడు. అతని పాత్ర సహాయనటుడికి ఎక్కువ విలన్ కు తక్కువ అన్నట్టు తయారయ్యింది.

7)సినిమాలో చాలా మంది సీనియర్ క్యాస్టింగ్/స్టార్ క్యాస్టింగ్ ఉంది. కానీ ఎవ్వరినీ కూడా సరిగ్గా వాడలేదు. ‘డార్లింగ్’ సినిమాలో హీరో పేరెంట్స్ ను యాజ్ ఇట్ ఈజ్ గా ఇందులో హీరోయిన్ పేరెంట్స్ గా పెట్టాడు దర్శకుడు. వాళ్లకు కి కూడా సరైన సన్నివేశాలు లేవు.

8)దేవి శ్రీ ప్రసాద్ రెండు పాటలు బాగా ఇచ్చాడు. స్క్రీన్ పై కూడా అవి బాగున్నాయి. కానీ నేపధ్య సంగీతం విషయంలో చాలా నీరసం తెప్పించాడు. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది బాగుండాలి. అది కూడా మిస్ ఫైర్ అయ్యింది.

9)లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ కు డైలాగ్స్ అనేవి కూడా చాలా కీలకం. ఇక్కడ అవి కూడా మైనస్ అయ్యాయి.

10) లవ్ అండ్ ఫ్యామిలీ మూవీ అనగానే ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి. ఎప్పుడైతే అది లోపించిందో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అవుతుంది. ‘రంగ రంగ వైభవంగా’ ఈ విషయంలో బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus