Nagarjuna: 8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర విషయాలు!

  • August 29, 2022 / 04:09 PM IST

అక్కినేని నాగేశ్వర రావు గారి చిన్నబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. కానీ వారసత్వం అనేది నాగార్జునకి కలిసి రాలేదు. తండ్రి స్టార్ డం అనేది ఎంట్రీ వరకే హెల్ప్ చేసింది. కానీ తన సొంత టాలెంట్ తోనే నాగార్జున స్టార్ అయ్యారు అనేది వాస్తవం. ఈరోజు నాగార్జున 63వ పుట్టినరోజు కావడంతో అభిమానులు ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా చోట్ల అన్నదానాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు నాగార్జున పుట్టినరోజు కావడంతో ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి :

1) 8 నెలల వయసున్నప్పుడే నాగార్జున సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎలా అనుకుంటున్నారా? అక్కినేని నాగేశ్వర రావు గారు నటించిన ‘వెలుగు నీడలు’ సినిమాతో మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు నాగార్జున. అటు తర్వాత తన తండ్రి నటించిన ‘సుడిగుండాలు’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి ముందు ఏఎన్నార్ గారు లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రెస్. ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలనే ఉద్దేశంతో ‘సుడిగుండాలు’ చిత్రం చేశారు. ఈ మూవీలో ఓ కొత్త ఏఎన్నార్ కనిపించారు అని చెప్పొచ్చు.

2) ఇక 1986 లో వచ్చిన ‘విక్రమ్’ చిత్రంతో నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శోభన హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి వి.మధుసూధన రావు దర్శకుడు. ఈ మూవీ యావరేజ్ టు ఎబౌవ్ యావరేజ్ అన్నట్టు ఆడింది. నాగ్ కు కావాల్సిన విజయాన్ని అందించలేకపోయింది.

3) అటు తర్వాత నాగార్జున నటించిన ‘కెప్టెన్ నాగార్జున’ ‘అరణ్య కాండ’ చిత్రాలు ప్లాప్ అయ్యాయి. దీంతో నాగార్జున ఆ రోజుల్లోనే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ‘హీరోగా నాగార్జున పనికిరాడు’ అంటూ అప్పటి మాస్ హీరోల అభిమానులు నాగార్జున పై నెగిటివ్ కామెంట్లు చేశారు.

4) ఈ క్రమంలో నాగార్జున మొదటి హిట్ కోసం తన తండ్రి కంఫర్ట్ జోన్ ను ఫాలో అవ్వక తప్పలేదు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘మజ్ను’ అనే చిత్రం చేశారు నాగార్జున. ఇది నాగార్జునకి మొదటి హిట్ ను అందించిన మూవీ.

5) ‘మజ్ను’ తర్వాత నాగార్జునకి ‘కలెక్టర్ గారి అబ్బాయి’ ‘ఆఖరి పోరాటం’ వంటి హిట్లు ఉన్నాయి కానీ.. ఆ సినిమాల సక్సెస్ క్రెడిట్ నాగార్జునకి దక్కలేదు. ‘కలెక్టర్ గారి అబ్బాయి’ చిత్రంలో నాగేశ్వర రావు గారి రోల్ డామినేట్ చేస్తే, ‘ఆఖరి పోరాటం’ చిత్రానికి రాఘవేంద్ర రావు గారి ఇమేజ్, శ్రీదేవి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో నాగార్జున కి కలిసొచ్చింది ఏమీ లేదు.

6) నాగార్జునకి మంచి బ్రేక్ ఇచ్చిన మూవీగా ‘జానకి రాముడు’ ని చెప్పుకోవచ్చు. ఈ మూవీ నిజానికి బాలకృష్ణ- కోడి రామకృష్ణ కాంబినేషన్లో రూపొందాల్సిన మూవీ. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. దీంతో నాగార్జున- కె.రాఘవేంద్ర రావు గారి కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కింది. రాజమౌళి తండ్రి కె.విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి ఓ రైటర్ గా పనిచేశారు.

7) ఇదే క్రమంలో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా క్లాసిక్ గా నిలవడంతో నాగార్జునకి కథల విషయంలో మంచి టేస్ట్ ఉందని అంతా ఫిక్స్ అయ్యారు.

8) ఇక 1989 వ సంవత్సరంలో ఎవ్వరూ ఊహించని విధంగా నాగార్జున.. రాంగోపాల్ వర్మ అనే కొత్త దర్శకుడితో ‘శివ’ అనే చిత్రం చేశాడు. ఈ మూవీ అప్పటివరకు ఉన్న రికార్డులను కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నాగార్జునకి పోటీగా ఉన్న చిరు, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలు ఒకే ఫార్మేట్ లో సినిమాలు చేసి హిట్లు కొడుతుండడంతో, ‘శివ’ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. నాగ్ గట్స్ కు మెచ్చుకోని వారంటూ లేరు. ఇది ఆ టైంకి ఓ గేమ్ ఛేంజర్ మూవీ అనే చెప్పాలి. మాస్ సినిమాలకు ఓ కొత్త డెఫినిషన్ చెప్పింది ఈ మూవీ.

9) క్లాస్, మాస్, ఫ్యామిలీస్ అనే కాదు ‘అన్నమయ్య’ ‘శ్రీరామదాసు’ వంటి చిత్రాలతో అగ్ర హీరోలు టచ్ చేయని జోనర్లను టచ్ చేసి.. అలా కూడా బ్లాక్ బస్టర్లు అందుకున్నారు నాగ్.

10) ‘అన్నమయ్య’ చిత్రానికి స్పెషల్ మెన్షన్ కేటగిరీలో ఓ నేషనల్ అవార్డు, ‘నిన్నేపెళ్లాడతా’ చిత్రానికి ‘బెస్ట్ తెలుగు ఫిలిం’ కేటగిరీలో నిర్మాతగాను నేషనల్ అవార్డు అందుకున్నారు నాగార్జున. టాలీవుడ్లో ఇప్పటివరకు ఇలాంటి ఘనత సాధించిన హీరో మరొకరు లేరు.

11)తన 36 ఏళ్ళ సినీ కెరీర్లో ఏకంగా 35 కి మందికి పైగా కొత్త దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేశారు నాగార్జున. ఇందులో చాలా మంది టాప్ డైరెక్టర్లుగా ఎదిగారు. నిర్మాతగా కూడా 30 కి పైగా సినిమాలను నిర్మించారు నాగార్జున. అంతేకాదు చాలా సినిమాల్లో స్పెషల్ రోల్స్ కూడా ప్లే చేశారు. టాలీవుడ్లో నాగార్జున ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. బుల్లితెర పై కూడా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ‘బిగ్ బాస్’ వంటి రియాలిటీ షోలను హోస్ట్ చేసి అన్ని విధాలుగా కూడా ‘కింగ్’ అని ప్రూవ్ చేసుకున్నారు నాగార్జున. త్వరలో ఈయన ‘ఘోస్ట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus