Sameera Reddy: హాట్ బికినీతో షాక్ ఇచ్చిన సమీరారెడ్డి.!

ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమీరారెడ్డి ప్రస్తుతం సరికొత్త లైఫ్ తో జీవితాన్ని కొనసాగిస్తోంది. ఈ బ్యూటీ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. మొదట చేసిన నరసింహుడు సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలువగా ఆ తర్వాత చేసిన అశోక్ సినిమా పరవాలేదు అనిపించింది.

ఇక మెగాస్టార్ చిరంజీవితో కూడా జై చిరంజీవ అనే సినిమా చేసింది. అయితే ఈ బ్యూటీ బ్యాడ్ లక్ ఏమిటో గాని తెలుగులో చేసిన మూడు సినిమాలు కూడా అనుకున్నంతగా విజయాన్ని అందుకోలేక పోయాయి. ఇక ఎక్కువగా బాలీవుడ్ బెంగాలీ తమిళ సినిమాలతో బిజీగా కనిపించిన సమీరారెడ్డి తన స్టార్ డమ్ ను కూడా ఎక్కువ కాలం కొనసాగించలేక పోయింది. ఇక మధ్యలో కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసిన విషయం తెలిసిందే. తెలుగులో రానా దగ్గుబాటి కృష్ణం వందే జగద్గురం సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ తో దర్శనమిచ్చింది.

ఇక మళ్ళీ ఆ తర్వాత సినిమాల వైపు ఎక్కువ గా చూడలేదు. ఇక అక్షయ్ వార్దేను 2014లో పెళ్లి చేసుకున్న సమీరారెడ్డి అనంతరం ఒక కొడుకు కూతురుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం విదేశాల్లో వారితోనే ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. దాదాపు సినిమాలకు గ్యాప్ ఇచ్చి 7 ఏళ్ళు కావస్తోంది అయినప్పటికీ ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అస్సలు తగ్గలేదు. రెగ్యులర్ గా పోస్ట్ పోస్ట్ చేస్తున్న గ్లామర్ ఫోటోలు బాగానే వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా బీచ్లో హాలిడేస్ ను ఎంజాయ్ చేసిన సమీరా రెడ్డి బికినీ ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

1

2

3

4

5

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus