Lahari Shari: ‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

‘బిగ్ బాస్ 5’ లో 3వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లహరి షెరి. ‘అర్జున్ రెడ్డి’ ఫ్యాన్స్ కు ఈమె సుపరిచితమే.ఆ సినిమాలో నర్స్ గా కనిపించి ఆకట్టుకుంది. చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ ఈమె బాగా పాపులర్ అయ్యింది. తనని తాను తెలుసుకోవడం కోసం ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఈమె చెప్పుకొచ్చింది.రావడం రావడమే హోస్ట్ నాగార్జునకి ఓ బ్లూ ఫ్లవర్ ను ఇచ్చి.. తనని అమ్ము అని పిలవాలని ఈమె కోరింది. అందుకు నాగార్జున కూడా ఓకె చెప్పి.. లహరిని అమ్ము అని పిలవడం మొదలుపెట్టాడు.సరే.. లహరి గురించి ఈ విషయాలు మీకు తెలుసో లేదో ఓ లుక్కేయండి :

  • ఈమె పూర్తి పేరు శరణ్య లహరి శర్మ.ఈమె తెలంగాణకి చెందిన అమ్మాయే.ఈమె పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే.. అయితే ఈమె తల్లిదండ్రులు వరంగల్ కు చెందిన వాళ్ళు.

  • లహరి ఓ మోడల్. నిజానికి ఈమె మొదట ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు. యాదృశ్చికంగా వచ్చినట్టు ఈమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

  • దాదాపు 5 ఏళ్ల నుండీ ఈమె ఇండస్ట్రీలో ఉంది.2016లో ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ‘సెలబ్రేషన్స్’ అనే ఓ షో ద్వారా ఈమె కెరీర్ ను మొదలుపెట్టింది.

  • 2017 లో రిలీజ్ అయిన ‘అర్జున్ రెడ్డి’ లో నర్స్ పాత్ర పోషించింది లహరి. ఓ కాఫీ షాప్ వద్ద దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈమెను చూసి ఆ పాత్రకి సంప్రదించాడట.ఆ పాత్ర నచ్చడంతో ఈమె వెంటనే ఓకే చేసింది.

  • అటు తర్వాత ఈమె మహా న్యూస్ వంటి న్యూస్ ఛానల్ లో పనిచేసింది.అయితే న్యూస్ ప్రెజంటర్ గా కాదు.. డిబేట్స్, ఇంటర్వూస్ వంటి వాటికి హోస్ట్ గా చేసేది.

  • దివంగత క్రిటిక్ మరియు నటుడు అయిన కత్తి మహేష్ తో చేసిన డిబేట్ ద్వారా ఈమె మరింత పాపులర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ – కత్తి మహేష్ ల ఇష్యులో ‘బెజవాడ’ మూవీ దర్శకుడు వివేక్.. ‘మీ అమ్మ గురించి చెప్పండి’ అంటూ కత్తి మహేష్ ను ప్రశ్నించడం. దానికి అర్ధాంతరంగా కత్తి మహేష్ ఆ డిబేట్ నుండీ లేచి వెళ్ళిపోవడం’ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి యాంకర్ గా వ్యవహరించింది లహరినే.

  • అటు తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఎన్నో విషయాల్లో సపోర్ట్ గా నిలిచింది లహరి. ఆ టైములో ఈమె పేరు మార్మోగింది.

  • ‘డైన్ వైన్’ అనే ఓ షోలో సెలబ్రటీతో వైన్ తాగించి ఈమె మరింత పాపులర్ అయ్యింది అనే చెప్పాలి.ఈ షోకి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి.

  • ‘అర్జున్ రెడ్డి’ తో పాటు ‘పటేల్ సర్’ ‘అజ్ఞాతవాసి’ పేపర్ బాయ్’ ‘శ్రీనివాస కళ్యాణం’ ‘మళ్ళీ రావా’ ‘యు కథే హీరో’ ‘తిప్పరా మీసం’ ‘జాంబీ రెడ్డి’ ‘రామాపురం’ ‘హంతకుడెవరు’ వంటి సినిమాల్లో నటించింది.

  • త్వరలో రాబోతున్న వరుణ్ తేజ్ ‘గని’ , అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో కూడా ఈమె నటిస్తుంది. అంతేకాకుండా ‘డియర్ కామ్రేడ్’ మూవీలో రష్మిక అక్క పాత్రను పోషించిన ఆమెకి డబ్బింగ్ చెప్పింది కూడా లహరినే కావడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus