ఈ ఏడాది బాలీవుడ్ లో మొదట పెళ్లి చేసుకున్న నటుడు వరుణ్ ధావన్. గత ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఈ యువ హీరో కరోనా లాక్ డౌన్ వలన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే త్వరలో మరొక బాలీవుడ్ సెలబ్రెటీ పెళ్లి కూడా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె మరెవరో కాదు. ఇదివరకు ప్రభాస్ తో కలిసి నటించిన హీరోయిన్. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సాహోలో నటించిన హాట్ బ్యూటీ శ్రద్దా కపూర్ టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ అందుకుంది.
అయితే ఈ బ్యూటీ త్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇక ఇటీవల వరుణ్ ధావన్ కూడా ఆమె పెళ్లిపై ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశాడు. అది ఎలా అంటే.. శ్రద్దా కపూర్ రోహన్ శ్రేష్ట్ అనే ఫోటోగ్రాఫర్ తో గత కొంతకాలంగా లవ్ లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అసలైతే ఆమె వివాహం గత ఏడాదిలో జరగాల్సిందట. ఇక ఫైనల్ గా ఈ సమ్మర్ అనంతరం పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
వరుణ్ ధావన్, రోహన్ శ్రేష్ట్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. అయితే ఇటీవల ట్విట్టర్ ద్వారా రోహన్ పెళ్లి శుభాకాంక్షలు తెలుపగా త్వరలో నువ్ కూడా లక్కీ పర్సన్ అవుతావ్ అంటూ వివరణ ఇవ్వడంతో వారి పెళ్లి జరగడానికి ఎంతో సమయం లేదని టాక్. ఎందుకంటే శ్రద్దా కూడా వరుణ్ ధావన్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్. అతనికి వీరి మ్యాటర్ తెలియకుండా ఉండదని చెప్పవచ్చు.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!