వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

ఇప్పటి టాలీవుడ్ స్టార్లు.. ఒక్క నేషనల్ అవార్డు కొట్టడానికే కిందా మీదా పడుతున్నారు. దాని వెనుక చాలా రాజకీయాలు, అలాగే టాలీవుడ్ అంటే మిగిలిన ఇండస్ట్రీలకు చిన్న చూపు ఉంది అనే గుసగుసలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి.ఇక ఆస్కర్ అనే పదానికి అయితే మన తెలుగు సినిమా అందనంత దూరంలో ఉందనే చెప్పాలి. గతంలో బలమైన రాజకీయ నాయకులు తమకు ఇష్టమైన సినిమా స్టార్లకు నేషనల్ అవార్డులు వచ్చేలా చేసేవారు అనే టాక్ ఉండేది.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కువ కనిపించడం లేదు. అలాంటిది అప్పట్లో కొంత మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. దాంతో మన టాలీవుడ్ స్థాయి ప్రపంచానికి చాటారనే చెప్పాలి. ఇంతకీ వారెవరో ఓ లుక్కేద్దాం రండి :

సుశీల: గాన కోకిలగా పేరు పొందిన సుశీల గారు గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. ఏకంగా 18 వేల పాటలు పాడి ఆమె ఈ రికార్డ్ ను సొంతం చేసుకుంది.

ఎస్పీ బాలసుబ్రమణ్యం: గాన గంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రమణ్యం కూడా 2001లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. 40 వేల పాటలు పాడిన బాలుగారు గతేడాది కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే.

డి.రామానాయుడు: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్.. మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు గారు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఏకంగా 13 భాష‌ల్లో 150కి పైగా చిత్రాల‌ను నిర్మించిన రామానాయుడు గారు.. అత్య‌ధిక సినిమాలను అందించిన నిర్మాత‌గా 2008 లో గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు.

విజయ నిర్మల: అప్పటి రోజుల్లోనే తెలుగుతో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో ఇంచు మించు 42 సినిమాలు డైరెక్ట్ చేసిన మ‌హిళ‌గా విజ‌య‌నిర్మ‌ల గారు 2000 వ సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.

గజల్ శ్రీనివాస్: ఈయన ఏకంగా 100 భాష‌ల్లో 100 గజల్స్ పాడిన సింగర్ గా రికార్డు సృష్టించాడు. అందుకే 2008లో ఈయన పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.

బ్రహ్మానందం: టాలీవుడ్ స్టార్ కమెడియన్.. ఇప్పుడు ఆయన ఫామ్లో ఉన్నా.. లేక పోయినా, కామెడీ అనగానే ఆయన పేరే గుర్తొస్తుంది. ఆయనే మన బ్రహ్మి. ఈ లెజెండరీ కమెడియన్ 1000కి పైగా సినిమాల్లో నటించినందుకు గానూ 2010లో గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus