టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఒకరు. పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా ఈమె చాలా సీనియర్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తుండడంతో పలువురు ఈ విషయం గురించి ఎన్నోసార్లు విమర్శలు కూడా చేశారు.
అయితే తాజాగా ఇదే విషయం గురించి శ్రీలీలను (Sreeleela) ప్రశ్నించడంతో ఆమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెను యాంకర్ ప్రశ్నిస్తూ మీరు వరుసగా ఆగ్ర హీరోల సినిమాలలో చేయడం వల్ల మీపై ఏదైనా ఒక ముద్ర పడుతుందని భయపడుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శ్రీ లీల సమాధానం చెబుతూ.. సీనియర్ హీరోలతో నటిస్తే ఒక విధంగా యంగ్ హీరోలతో నటిస్తే మరొక విధంగా ఇమేజ్ వస్తుంది అన్న రోజులు ఎప్పుడో పోయాయని ఈమె తెలియజేశారు.
ప్రజలు ప్రస్తుతం అలాంటి ఆలోచనలు కూడా చేయడం లేదని చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారని శ్రీ లీల తెలిపారు. సినిమా అనేది మనం సృష్టించిన కథ ఆ పాత్రలకు ఎవరైతే సరిపోతారో వారినే ఎంపిక చేసుకుంటున్నారన్న ఆలోచన ప్రేక్షకులు చేస్తున్నారని తెలిపారు. అయితే మనం చేయాల్సిందల్లా ఒక్కటే మనం చేస్తున్న పాత్రలకు 100 శాతం న్యాయం చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని మాత్రమే ఆలోచించాలని తెలిపారు.
ప్రేక్షకులకు కూడా ఇదే విషయాన్ని గమనిస్తున్నారని, అలా కాకుండా తన పక్కన స్టార్ హీరో ఉన్నాడా యంగ్ హీరో ఉన్నాడా అన్న విషయాల గురించి ప్రేక్షకులు ఆలోచించడం లేదని తెలిపారు. ఇక ఏ ఆర్టిస్ట్ కూడా ఇలాంటి ఆలోచన చేయదని వారికి అలాంటి ఆలోచనలు కూడా రావని,వయసును ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని నటీనటులు సినిమా చేయరు అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!