దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఒకానొక సమయంలో అగ్ర హీరోలందరి సరసన నటించిన వారిలో నటి సుహాసిని మణిరత్నం ఒకరు. తెలుగు తమిళ భాష చిత్రాలలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించారు. ఇక ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుహాసిని తాను హీరోయిన్గా నటిస్తున్న సమయంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను గురించి బయటపెట్టారు.
ఒక సినిమా షూటింగ్ సమయంలో తాను ఎంతో ఇబ్బంది పడ్డానని కొన్ని సన్నివేశాలు చేయడానికి తనకు ఏ మాత్రం మనసు ఒప్పలేదని సుహాసిని తెలిపారు. ఒక సినిమా షూటింగ్లో భాగంగా నన్ను హీరో ఒడిలో కూర్చొని నటించమని చెప్పారు. ఇలా వేరే వ్యక్తి ఒడిలో కూర్చోవడం చాలా తప్పు. అందుకనే నేను ఈ సన్ని వేషంలో నటించనని ఖరాఖండిగా దర్శక నిర్మాతలకు చెప్పేశాను. విధంగా మరొక సన్నివేశంలో హీరోతో పాటు ఒకే ఐస్ క్రీమ్ తినమని చెప్పారు.
ఇలా హీరో తిన్నటువంటి ఐస్ క్రీమ్ నేను (Suhasini) కూడా తినడం ఏంటి ఇలాంటి సన్నివేశాలలో తాను నటించనని హీరో తిన్నటువంటి ఐస్ క్రీమ్ నేను తినను కావలసి వస్తే ఇంకొక ఐస్క్రీం తెప్పించండి లేకపోతే ఈ సన్నివేశాన్ని తీసేయండి అంటూ నిర్మహమాటంగా చెప్పానని సుహాసిని తెలిపారు. నేను ఇలాంటి సన్నివేశాలలో నటించనని మొండి చేయడంతో అప్పటినుంచి తనకు ఇలాంటి సీన్స్ పెట్టేవారు
కాదని ఆ క్షణం నుంచి నేను ఇలాంటి సన్నివేశాలకు దూరంగా ఉంటాను అనే విషయం అందరికీ తెలిసిందంటూ సుహాసిని ఈ సందర్భంగా తాను హీరోయిన్ గా నటించే సమయంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు