ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి యూత్ లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తో మాస్ ఆడియన్స్ లో కూడా భీభత్సమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. డాన్స్ లు, ఫైట్లు చాలా ఎనర్జిటిక్ గా చేసే ఇతను బోయపాటి శ్రీను వంటి మాస్ డైరెక్టర్ చేతిలో పడితే ఎలా ఉంటుంది. ఆ ఊహే ‘స్కంద’ పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసింది. బయ్యర్స్ కూడా ఈ సినిమాకి ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి కొనుగోలు చేశారు. ఈ సినిమాకి ఏకంగా రూ.43 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మరి రామ్ కి అంత బాక్సాఫీస్ స్టామినా ఉందా? అనేది అతని గత 10 సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్స్ ను బట్టి తెలుసుకుందాం రండి :
1) మసాలా :
రామ్ తో పాటు వెంకటేష్ హీరోగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీని కె.విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశాడు. రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్లో కేవలం రూ.12 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ అయ్యింది.
2) పండగ చేస్కో :
రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ చిత్రం రూ.15.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.15.85 కోట్ల షేర్ ను రాబట్టి.. డీసెంట్ హిట్ అనిపించుకుంది.
3) శివమ్ :
రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం రూ.16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.6.8 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. డిజాస్టర్ గా మిగిలింది.
4) నేను శైలజ :
రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ చిత్రం రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.21 కోట్ల షేర్ ను రాబట్టి.. సూపర్ హిట్ గా నిలిచింది.
5) హైపర్ :
రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.15.2 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
6) ఉన్నది ఒక్కటే జిందగీ :
రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.17.8 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ గా నిలిచింది.
7) హలో గురు ప్రేమ కోసమే :
రామ్ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ.17.65 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.20.69 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ హిట్ గా నిలిచింది.
8) ఇస్మార్ట్ శంకర్ :
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ.17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో ఏకంగా రూ.35.5 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
9) రెడ్ :
రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ.15.7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.19.79 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది
10) ది వారియర్ :
రామ్ (Hero Ram) హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రూ.40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.21.57 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
ఇక ఇటీవల రిలీజ్ అయిన ‘స్కంద’ చిత్రం 5 రోజుల్లో రూ.26 కోట్ల షేర్ ను రాబట్టింది. కానీ ఇంకా రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.