‘బిగ్ బాస్ సీజన్ 7 ‘ చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. ‘బిగ్‌బాస్’ రియాలిటీ షో తెలుగులో కూడా సూపర్ సక్సెస్ సాధించింది. కానీ 5 సీజన్ల వరకు మాత్రమే సక్సెస్ ఫుల్ గా సాగింది అని అంతా అనుకున్నారు. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ ఓటీటీ సీజన్ మొదలయ్యాక ఈ రియాలిటీ షో హవా తగ్గినట్టు కనిపించింది. సీజన్ 6 అయితే దారుణమైన టి.ఆర్.పి రేటింగ్ నమోదైంది. దీంతో బిగ్ బాస్ పని ఇక అయిపోయింది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.కానీ సీజన్ 7 ప్రీమియర్ కి ఏకంగా 18 టి.ఆర్.పి రేటింగ్ రేటింగ్ నమోదైంది. 5.1 కోట్ల మంది ప్రేక్షకులు ఈ ప్రీమియర్ ను వీక్షించినట్టు .. స్టార్ మా వారు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక సీజన్ 7 ఫస్ట్ వీక్ లో ఆల్రెడీ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ఇక రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ సీజన్ కి 9 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు టేస్టీ తేజ. బిగ్ బాస్ సీజన్ 7 లో ఇతని కొద్దో గొప్పో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. ఇతని గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి :
1) టేస్టీ తేజ పూర్తి పేరు తెనాలి తేజ. ఇతను 1994 వ సంవత్సరంలో జూన్ 12 న జన్మించాడు. ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి. ఇతనొక బి.టెక్ విద్యార్థి.
2) ఇతను ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టక ముందు సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పనిచేశాడు.
3) ఇతని తండ్రి పేరు కల్లం శ్రీనివాసరెడ్డి. ఇతనికి ఒక్క ఉంది. ఆమె పేరు ప్రసన్న.
4 ) ఇతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అలాగే ఇతనిది హిందూ కుటుంబం.
5) ఇతను సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ముందుగా జబర్దస్త్ కామెడీ షోలో కొన్నాళ్ళు పనిచేశాడు.
6) అటు తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ లో ఫుడ్ వీడియోలకు యాంకరింగ్ చేస్తూ.. పాపులర్ అయ్యాడు.
7) తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఇతను ఫుడ్ వీడియోలు చేయడం జరిగింది.
8) సినిమా ప్రమోషన్ల కోసం ఇతని ఫుడ్ వీడియోస్ లో హీరో, హీరోయిన్లు కూడా పాల్గొనేవారు. అలా అతను ఇంకా పాపులర్ అయ్యాడు
9) తేజకి (Tasty Teja) పలు సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినట్టే వచ్చి..చేజారి పోయాయని తెలుస్తుంది. లేదంటే ఇతను కచ్చితంగా మంచి కమెడియన్ గా సెటిల్ అయ్యేవాడు అని అంతా అనుకుంటున్నారు.
10) తేజకి గర్ల్ ఫ్రెండ్స్ వంటి వారు లేరట. గతంలో కొంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేసినప్పటికీ వాళ్ళు రిజెక్ట్ చేసారని ఫన్నీగా చెబుతూ ఉంటాడు. అయితే ఇతను సెలబ్రిటీ అయ్యాక చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేసి మాట్లాడటం ఇతనికి సంతోషాన్ని కలిగించింది.
11)’ బిగ్ బాస్ 7 ‘ విన్నర్ గా గా నిలిచి సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకోవాలనేది ఇతని లక్ష్యం. మరి బిగ్ బాస్ లో ఎంత వరకు రాణిస్తాడో చూడాలి