Surekha Vani: రెండో పెళ్లి ఆలోచనలు సురేఖ వాణి.. వైరల్ అవుతున్న పోస్ట్!

తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం సినీ సెలెబ్రెటీలు లేటు వయసులో రెండో పెళ్లిళ్లు చేసుకుంటున్నటువంటి సంఘటనలు తలేత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే సురేఖ వాణి కూడా రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నారని తాజాగా ఆమె షేర్ చేసిన ఇంస్టాగ్రామ్, రీల్ చూస్తే అర్థమవుతుంది. ముసలోళ్లకి, ముతకోల్లకి పెళ్లిళ్లు అవుతున్నాయి.. నాకు ఎందుకు అవ్వడం లేదురా అంటూ సాగే ఫన్నీ రీల్‌ను ఇప్పుడు సురేఖా వాణి తన ఇన్ స్టా స్టోరీలో పెట్టుకుంది. ఇలా రెండో పెళ్లి నాకెందుకు కాలేదు అంటూ ఈమె చేసినటువంటి ఈ రీల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సురేఖ వాణి కూడా రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా ఇలా తన మనసులో మాటను ఈ విధంగా బయటపెట్టారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

సురేఖ వాణి (Surekha Vani) వ్యవహారం చూస్తుంటే ఈమె కూడా త్వరలోనే ఈ శుభవార్తను చెప్పబోతున్నారని తెలుస్తుంది. సురేఖ వాణి ఇదివరకే సురేష్ తేజ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈమెకు సుప్రీతా అనే కుమార్తె కూడా ఉంది అయితే 2019వ సంవత్సరంలో అనారోగ్య సమస్యల కారణంగా సురేఖవాణి భర్త సురేష్ తేజ మరణించారు.

ఇలా తన భర్త మరణించిన తర్వాత ఈమె ఒంటరిగా తన కుమార్తెతో కలిసి ఉంటున్నారు. అయితే సురేఖ వాణి రెండో పెళ్లి గురించి తరచు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus