Tamannaah: బాలీవుడ్ హీరో పై మనసు పడిన తమన్న అవకాశం వస్తే మరోసారి అంటూ కామెంట్స్!

  • September 20, 2022 / 02:09 PM IST

హ్యాపీ డేస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన తమన్న ఆ సినిమా వల్ల నటిగా మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోల సరసన నటించింది. ఇలా తెలుగు, తమిళ హిందీ, అని తేడా లేకుండా అన్ని భాషలలోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి తమన్నా ఇప్పటికీ ఏమాత్రం అవకాశాలు తగ్గకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడు బబ్లీ బౌన్సర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానుంది. మొదటి మహిళా బౌన్సర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీన ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ సినిమా ప్రమోషన్ పనులలో జోరుగా పాల్గొంటుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్న ఇటీవల బిగ్ బాస్ తెలుగు షోలో కూడా హాజరైంది. ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తమన్నాని విలేకరి ప్రశ్నిస్తూ.. మళ్ళీ ఏ హీరోతో నటించాలని ఉంది అడగ్గా..

తనకు సైఫ్ అలీఖాన్‌ తో కలిసి నటించాలని ఉందని వెల్లడించింది. గతంలో సైఫ్ అలీఖాన్‌, తమన్నా 2014లో వచ్చిన Humshakals సినిమాలో కలిసి నటించారు. ఇక మరొకసారి సైఫ్ అలీ ఖాన్ తో నటించే అవకాశం కోసం తమన్న ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా తమన్నా లీడ్ రోల్ చేసిన బబ్లీ బౌన్సర్ సినిమా సెప్టెంబర్ 23 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక తమన్నా తదుపరి సినిమాల విషయానికి వస్తే తెలుగు హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన తమన్న ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది. అంతే కాకుండా ప్లాన్ ఏ ప్లాన్ బీ, భోలే చుడియాన్‌ వంటి హిందీ సినిమాలలో కూడ నటిస్తోంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus