Actress: ఆ స్టార్ హీరోయిన్ కు ఆలా పుట్టాలని ఉందంటా?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1999లో మొదటిసారి నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిష 24 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. టాలీవుడ్ లో త్రిష సినిమా వర్షం ద్వారా పరిచయం అయ్యింది. ఇప్పటికీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా తన 40వ పుట్టినరోజుని జరుపుకుంది.

40 పదుల వయసులో కూడా త్రిష అందానికి అభిమానులు ముగ్ధులు అవుతున్నారు. అయితే ఇప్పటికీ అమ్మడు పెళ్లికి దూరంగా బ్యాచిలర్ గానే జీవిస్తోంది. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ లో కూడా కీలక పాత్రలో సందడి చేసింది. ఇదిలా ఉండగా మగవారి గురించి ఇటీవల త్రిష చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష కి పురుషుల గురించి మీ అభిప్రాయం ఏమిటి ? అనే ప్రశ్న ఎదురయింది.

ఇక ఈ ప్రశ్నకు (Actress) త్రిష స్పందిస్తూ..” సాధారణంగా ఆడవారిని అర్థం చేసుకోవడం చాలా కష్టమని అంటుంటారు. కానీ మగవారిని అర్థం చేసుకోవడమే చాలా కష్టం అంటూ తెలిపింది. మగవారు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరొక విధంగా నటిస్తారు. వారి మానసిక పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి నాకు ఒక రోజు మగవాడిగా పుట్టాలనిపిస్తుంది అంటూ త్రిష చెప్పకు వచ్చింది.

ఈ విషయాన్ని తాను తన తల్లితో కూడా చెప్పినట్లు త్రిష వెల్లడించింది. పురుషుల గురించి ప్రస్తుతం త్రిష చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus