ఈ లాక్ డౌన్ టైం లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల లిస్టులో హీరోయిన్ వనితా విజయ్ కుమార్ కూడా ఉంది. అయితే ఈమెది మూడో పెళ్లి. అయితే ఈ పెళ్లి కూడా ఈమెకు ఎక్కడా లేని ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది అనే చెప్పాలి. ఈమె మూడో పెళ్లి చేసుకున్న పీటర్ పాల్ కు కూడా ఇది రెండో పెళ్లి. అందులోనూ అతను తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే.. రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంతో అతని మొదటి భార్య అయిన ఎలిజబెత్ .. పీటర్ పాల్ మరియు వనితల పై కేసు వేసింది.
అయినా ‘పెద్ద వాళ్ళైన ఇద్దరు కూతుర్లు ఉండగా.. మూడో పెళ్లి చేసుకోవడం ఏంటి?’ అంటూ కోలీవుడ్ సినీ సెలబ్రిటీలు కొంతమంది వనిత పై తీవ్ర విమర్శలు చేసారు. వాటికి వనిత కూడా ఘాటుగా రిప్లై ఇచ్చింది. ముఖ్యంగా ఓ లైవ్ షోలో దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ పై ‘ఒక్క మొగుడితో ఉంటున్నంత మాత్రాన నువ్వేమీ పతివ్రతవి కాదు.. నీ బ్రతుకు ఏంటో నాకు తెలుసు. నీ బండారం బయట పెడతా’ అంటూ ఘోరమైన కామెంట్స్ చేసింది.ఆ వ్యవహారం కేసుల వరకూ పరువునాష్టాదావాల వరకూ వెళ్లింది.
ఇదిలా ఉండగా..వనిత మూడో భర్త పీటర్ పాల్ గుండపోటుకు గురి అయ్యాడట. దీంతో వనిత కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తుంది.అయితే ఇది మైల్డ్ స్ట్రోక్ లాంటిదా? లేక పరిస్ధితి విషమంగా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video
Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!