Chiranjeevi Rejected Movies: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో ఇప్పటికీ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతోన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలను మించే విధంగా చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఇదిలా ఉండగా.. మన మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కొన్ని స్క్రిప్ట్ దశలోనూ.. మరికొన్ని షూటింగ్ దశలోనూ ఆగిపోయాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) కోదండరామిరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా.. దివ్యభారతి అలాగే మరో హీరోయిన్ తో…. ఇద్దరు పెళ్లాల కథాంశంతో ఓ సినిమా ప్లాన్ చేశారు. కానీ ఆ ప్రాజెక్టు స్క్రిప్ట్ క్లైమాక్స్ కుదరక ఆగిపోయింది.

2) కోదండరామిరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా ‘వజ్రాల దొంగ’ అనే సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. శ్రీదేవి ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. కానీ ఎందుకో అది సెట్స్ పైకి వెళ్ళలేదు.

3) ‘మనసంతా నువ్వే’ ‘నేనున్నాను’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తో చిరు ఓ సినిమా చెయ్యాలి అనుకున్నారు. కానీ ఎందుకో ఆ చిత్రం మొదలుకాలేదు.

4) సురేష్ కృష్ణ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా ‘అబూ బాగ్దాద్ గజదొంగ’ అనే చిత్రం కూడా ప్రారంభం అయ్యింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.

5) రామ్ గోపాల్ వర్మ-చిరంజీవి కాంబినేషన్లో ‘వినాలని వుంది’ అనే పేరుతో ఓ సినిమా మొదలయ్యి ఆగిపోయింది.

6) చిరంజీవి- సింగీతం శ్రీనివాస రావు కాంబినేషన్లో ‘భూలోక వీరుడు’ అనే జానపద చిత్రాన్ని ప్రారంభించారు. కానీ ఎందుకో అది మధ్యలోనే ఆగిపోయింది.

7) చిరంజీవి – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఆంధ్రావాలా’ అనే చిత్రం రూపొందాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్టుని మెగాస్టార్ రిజెక్ట్ చేసారు. చెప్పాలంటే ఇది మంచి డెసిషనే అని తరువాత తేలింది.

8) చిరంజీవి – పూరి జగన్నాథ్ కాంబినేషన్లోనే ‘ఆటో జానీ’ అనే ప్రాజెక్టుని అనౌన్స్ చేసారు. కానీ ఇది కూడా పట్టాలెక్కలేదు.

9) చిరంజీవి హీరోగా ‘శాంతినివాసం’ అనే మూవీ తెరకెక్కాల్సి ఉంది. కానీ అది షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.

10) ‘వడ్డికాసుల వాడు’ అనే చిత్రం కూడా చిరు చెయ్యాల్సి ఉంది. కానీ ఎందుకో అది కూడా ఆగిపోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus