రహస్యంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్న లేడీ కమెడియన్!

  • September 1, 2020 / 09:31 AM IST

సౌత్ లో లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ తెలియనివారుండరు. తన భిన్నమైన డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తమిళ, తెలుగు భాషలలో అనేక సినిమాలో నటించిన ఈ లేడీ కమెడియన్ రహస్యంగా ఎంగేజ్మెంట్ జరుపుకుంది. ఫిట్నెస్ ట్రైనర్ మరియు న్యూట్రిషన్ అయిన సంజయ్ తో ఆమె నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. వీరు కొద్దికాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. చెన్నైలో ఆగస్టు 26న ఈ వేడుక జరుగగా కేవలం మిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యాట.

ఈ వేడుక గురించి మరియు ఆమె ఎఫైర్ గురించి తమిళ మీడియాలో అనేక రూమర్స్ వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ఆమె వివరణ ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధలను అనుసరించి తమ నిశ్చితార్ధ కార్యక్రమం జరిగిందని ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే సంజయ్ తో ఆమె దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేయడం జరిగింది.

నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ 2012లో వచ్చిన నీతానే ఎన్ పోన్ వసంతం మూవీతో నటిగా పరిచయం అయ్యింది. ఇక తెలుగులో ఆమె రామయ్య వస్తావయ్యా, రన్ రాజా రన్ వంటి చిత్రాల్లో నటించింది. నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి చిత్రంలో కూడా విద్యుల్లేఖ నటించడం జరిగింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus