సౌత్ సినిమాల్లో మరో నటుల జంట పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తెలుగులో అప్పుడెప్పుడో కొన్ని సినిమాలు చేసి ఫర్వాలేదనిపించిన విమలా రామన్ పెళ్లి చేసుకోబోతోంది అని అంటున్నారు. వరుడు కూడా సినిమా పరిశ్రమకు చెందినవాడే. తమిళనాటు హీరో/విలన్ వేషాలతో రాణిస్తున్న వినయ్ రాయ్‌ని విమల పెళ్లి చేసుకుంటోంది అని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చూస్తే ఇదే చర్చ కనిపిస్తోంది. తెలుగులో ‘ఎవరైనా ఎపుడైనా’, ‘కులు మనాలి’, ‘రాజ్’, ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’, ‘చట్టం’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది విమలా రామన్.
ఆ తర్వాత ఒకటి రెండు టీవీ షోల్లో గెస్ట్ అప్పీయరెన్స్‌లు, డ్యాన్స్‌లు చేసింది. ఆమె తమిళ నటుడు వినయ్‌రాయ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడు వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. వినయ్ – విమల గత కొన్ని రోజులుగా ప్రేమపక్షుల్లా బయట తిరుగుతున్నారు. విదేశీ యాత్రలకు కూడా వెళ్తున్నారు. ఆ మధ్య మాల్దీవులు వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్టుల్లో తెలిసింది.
ఇప్పుడు పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు అవ్వాలని చూస్తున్నారట. వినయ్ రాయ్ ‘ఉన్నాలే ఉన్నాలే’ అనే సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘జయం కొందాన్’, ‘ఎంద్రెంద్రమ్ పున్నగై’ లాంటి సినిమాల్లో నటించాడు. ‘తుప్పరివలన్’ అనే విశాల్ సినిమాలో విలన్‌గా అదరగొట్టాడు. ‘వరుణ్ డాక్టర్’, ‘ఈటి’ తదితర చిత్రాల్లో నెగిటివ్ పాత్రల్లో కనిపించాడు. ప్రస్తుతం హీరో సూర్య ‘ఓ మై డాగ్’ సినిమాలో ముఖ్యపాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం విమలా రామన్ ‘గ్రాండ్ మా’ అనే తమిళ, మలయాళం సినిమా చేస్తోంది.
త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. గతేడాది ‘పబ్ గోవా’ అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. మరి పెళ్లి సంగతి ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి. ఈలోపు మనకు తెలిసిన సమాచారం మేరకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?