Actress: నటికి చేదు అనుభవం.. ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకోమంటూ…?

  • June 7, 2023 / 07:48 PM IST

సినిమాల్లో అవకాశాలు పొందడం అంత ఈజీ కాదు. ఒకవేళ అవకాశాలు వచ్చినా సక్సెస్ లేదు అంటే.. మొదటికే మోసం వస్తుంది. సినీనటుల జీవితం పైకి కలర్ ఫుల్ గానే ఉంటుంది కానీ..! మొదటి అడుగు వేసినప్పటి నుండి ఎన్నో అవమానాలు, భయాలు వంటివి రుచి చూడాలి. ముఖ్యంగా హీరోయిన్లు అవుదామనుకున్న అమ్మాయిలకి ఇంకా ఎక్కువ అవమానాలు ఎదురవుతాయి. అందంగా కనిపించే హీరోయిన్స్ కి కూడా వంకలు పెట్టేవాళ్లు చాలా మంది ఉంటారు.

కానీ యాక్టింగ్ స్కిల్స్ చెక్ చేసి అవకాశాలు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువమందే ఉంటారని కొంతమంది కామెంట్లు చేస్తుంటారు. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం… నటి సానియా మల్హోత్రా… ‘దంగల్’, ‘శకుంతల దేవి’, ‘లవ్ హాస్టల్’, ‘హిట్: ది ఫస్ట్ కేస్'(హిందీ) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. సన్యా మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించిన ‘కథల్’ సినిమా ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇందులో (Actress) ఈమె పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది. ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా.. సన్యా మల్హోత్రా పాల్గొని ఆమెకు కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ” ‘దంగల్’ సినిమా షూటింగ్ టైంలో ఓ వ్యక్తి నా రూపురేఖలు బాగాలేదని, దవడకు సర్జరీ అవసరం అని చెప్పాడు. అయితే ‘నేను నా అందం పట్ల సంతోషంగానే ఉన్నాను. నా దవడను చూసి అవకాశాలు ఇవ్వడం లేదు.

ఈ దవడ వల్ల నాకేమీ అవకాశాలు పోలేదు. సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు’ అని బదులిచ్చాను.ఇలా చాలా చోట్ల అన్నారు. కానీ నేను ఎవ్వరి కామెంట్స్ ను లెక్కచేయలేదు” అంటూ సన్యా మల్హోత్రా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె షారుఖ్ ఖాన్ – అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘జవాన్’ లో కూడా నటిస్తుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus