ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వారిని బుట్టలోకి వేసుకొని వారిని మానసిక వేధింపులకు గురిచేస్తూ, వ్యభిచారం, అత్యాచారం చేయించడం లాంటి దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. ఈ క్రమంలోనే ఎంతోమంది అమ్మాయిలు అలాంటి మోసగాళ్ల చేతుల్లో పడి వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. సాధారణ వ్యక్తుల విషయంలోనే కాకుండా ఇండస్ట్రీకి చెందిన నటీనటుల విషయంలో కూడా ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటుచేసుకున్నాయి.
తాజాగా ఓ సీరియల్ నటి నిర్మాత తనను వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. సినిమా నిర్మాత అని చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకుని ఆపై వ్యభిచారం చేయాలంటూ బలవంతం చేస్తున్నాడని సహాయ నటి పరమేశ్వరి అలియాస్ భైరవి శుక్రవారం చెన్నైలో డీజీపీకి ఫిర్యాదు చేసింది. భర్త లేని తాను ఇద్దరు పిల్లలతో చెన్నైలో ఉంటూ టీవీ సీరియల్స్ లో నటిస్తున్నానని.. వేలూరుకు చెందిన రాజా దేసింగ్ అలియాస్ సుబ్రమణి నిర్మాతగా పరిచయం చేసుకుని..
తనను కూడా నిర్మాతను చేస్తానని మోసగించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ఆ తరువాత తనను వ్యభిచార వృత్తిలోకి దింపడానికి ఒత్తిడి చేస్తున్నాడని వెల్లడించింది. తనతో పాటు తన పిల్లలను కూడా ఆ వృత్తి చేయాలని బలవంతం చేస్తున్నాడని పేర్కొంది. దీంతో అతడి నుంచి విడిపోయి పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పింది. అయినప్పటికీ.. రాజాదేసింగ్ తాను చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పలువురు అమ్మాయిలను మోసం చేశాడని, బాలికపై అత్యాచారానికి పాల్పడి పోక్సో చట్టం కింద అరెస్టు కూడా అయ్యాడని తెలిపింది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?