చీరలో పల్టీలు కొడుతూ రెచ్చిపోయిన ఆదా..!

  • January 12, 2021 / 09:25 PM IST

తెలుగు ఇండస్ట్రీలో చేసినవి కొన్ని సినిమాలే అయినా ఆదాశర్మ మాత్రం కుర్రాళ్లకి బాగా గుర్తుండిపోయింది. దీనికి కారణం ఇన్ స్ట్రా గ్రామ్ లో ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ తో తన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండటమే. ఎప్పటికప్పుడు తన యాక్టివిటీస్ ని స్టోరీస్ గా మార్చి కుర్రాళ్ల కళ్లని తనవైపు తిప్పుకునేలా చేస్తుంది ఈ చిన్నది. రీసంట్ గా తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా వేరే భాషల్లో సినిమాల్లో మాత్రం అడపాదడపా కనిపిస్తునే ఉంది. ఇక ఇప్పుడు బీచ్ లో చీరకట్టులో పల్టీలు కొడుతూ కాస్త వెరైటీగా రెచ్చిపోయింది అమ్మడు.

సముద్రపు అలలు వస్తుంటే ఆదా చేసిన ఈ ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. ఆదాశర్మ విన్యాసాలపై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. పూరీజగన్నాథ్ సినిమాతో హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన ఆదాశర్మ ఆ తర్వాత అడవిశేషుతో కలిసి చేసిన క్షణం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మింలలో, అలాగే పాటి పత్ని అనే వెబ్ సీరిస్ లో కూడా నటించింది.


Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus