అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ ఎక్కువగా ఉండవచ్చు గాని మనం సౌత్ ఇండస్ట్రీలో కూడా అంతకంటే ఎక్కువగా క్రేజ్ ఉన్న జోడిలు ఉన్నాయి. తమిళ్, కన్నడ, మళయాళం, తెలుగు ఇలా విభిన్నమైన ఇండస్ట్రీలతో కలగలిపే సౌత్ అంటే నార్త్ ఆడియేన్స్ లలో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి. ఇక అందమైన భార్యలు కొన్నిసార్లు హీరోల లెవెల్లో క్రేజ్ అందుకుంటారు. అలాంటి టాప్ స్టార్ కపుల్స్ పై ఒక లుక్కేస్తే..

అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టైలిష్ స్టార్ సినిమా సినిమాకు తన కష్టాన్ని బయటపెట్టి అగ్ర హీరోల జాబితాలో చేరాడు. ఇక ఆయన భార్య స్నేహ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి చెందిన ఆమె కాకపోయినప్పటికి సోషక్ మీడియా ద్వారా నెటిజన్స్ ను నిత్యం ఎట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. వీరికి అల్లు ఆయాన్, అల్లు ఆర్హ అనే కొడుకు, కూతురు ఉన్నారు.

సూర్య – జ్యోతిక

సింగం నటుడిగా సూర్య తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. సూర్య 2006 లో జ్యోతికను పెళ్లి చేసుకున్నాడు. అందమైన జంటకు దియా శివకుమార్ అనే కుమార్తె, దేవ్ శివకుమార్ అనే కుమారుడు ఉన్నారు. జ్యోతిక కూడా అప్పుడప్పుడు డిఫరెంట్ సినిమాలతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది.

దుల్కర్ సల్మాన్ – అమల్ సుఫియా

దుల్కర్ సల్మాన్ మలయాళ చిత్రాలలో ఎంతగానో క్రేజ్ అందుకున్నాడు. సీనియర్ నటుడు మమ్ముట్టి కొడుకుగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సల్మాన్ మహానటిలో జెమిని గణేషన్ పాత్రతో తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు. డిసెంబర్ 22, 2011 న, దుల్కర్ సల్మాన్ ఆర్కిటెక్ట్ అమల్ సుఫియాను వివాహం చేసుకున్నాడు. 5 మే 2017 న ఈ జంటకు అందమైన కుమార్తె మరియం అమీరా సల్మాన్ జన్మించారు

యశ్ – రాధిక పండిట్

యష్ ఒక శాండల్ వుడ్ నటుడని అందరికి తెలిసిందే. ఒక్క KGF సినిమాతో ఇండియా మొత్తం అతని పేరు మారుమ్రోగింది. మొగ్గినా మనసు, మిస్టర్ అండ్ మిసెస్ రామచారి చిత్రాల తరువాత, యష్ నటి రాధిక పండిట్‌తో ప్రేమలో పడ్డాడు. వారి నిశ్చితార్థం గోవాలో జరిగింది. ఈ జంట డిసెంబర్ 9, 2016 న వివాహం చేసుకున్నారు.

ఉపేంద్ర రావు – ప్రియాంక ఉపేంద్ర

నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు ఉపేంద్రరావు కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు. డిసెంబర్ 14, 2003 న, నటుడు బెంగాలీ నటి ప్రియాంకను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమారుడు కూతురు ఉన్నారు. కొడుకు ఆయుష్ ఉపేంద్ర, కుమార్తె ఐశ్వర్య ఉపేంద్ర .

దిలీప్ – కావ్య మాధవన్

20 అక్టోబర్ 1998లో, దిలీప్ నటి మంజు వారియర్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2000 లో మీనాక్షి అనే కుమార్తె జన్మించగా.. తరువాత, జూలై 2014 లో, విడాకుల కోసం దిలీప్ దాఖలు చేశారు, ఇది 31 జనవరి 2015 న మంజూరు చేయబడింది. 25 నవంబర్ 2016 న, కొలీలోని వేదాంత హోటల్‌లో దిలీప్ నటి కావ్య మాధవన్‌ను వివాహం చేసుకున్నారు.

అజిత్ కుమార్ – షాలిని కుమార్

అజిత్ కుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీలో 100కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరో. 1999లో తన చిత్రం సరన్ యొక్క అమర్కం చిత్రీకరణ సమయంలో అజిత్ తన సహనటుడు శాలినితో డేటింగ్ ప్రారంభించాడు. 2000 ఏప్రిల్ 24న ఈ జంట పెళ్లితో ఒకటయ్యారు. వీరికి అనౌష్కా అనే కుమార్తె, ఆద్విక్ అనే కుమారుడు ఉన్నారు.

జయం రవి – ఆర్తి

ఈ నటుడు 2003 లో బ్లాక్ బస్టర్ చిత్రం జయంతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. జూన్ 4, 2009 న జయం రవి ఒక గొప్ప వేడుకలో ఆర్తి మెడలో మూడు ముళ్ళు వేశాడు. ఈ దంపతులకు ఆరవ్ రవి, అయాన్ రవి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

నాగ చైతన్య – సమంతా రూత్ ప్రభు

అక్కినేని మూడవతరం వారసుడు అక్కినేని నాగ చైతన్య రెండవ సినిమా ఏ మాయ చేసావే సినిమాలో సమంత జెస్సిగా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఇక 2017 జనవరి 27న నటి సమంతా రూత్ ప్రభుతో నిశ్చితార్థం జరుగగా.. ఈ అందమైన జంట 2017 అక్టోబర్ 7న గోవాలో పెళ్లి చేసుకున్నారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus