స్టార్ హీరోయిన్ల మాల్దీవ్స్ హాలీడేస్ పై అదా శర్మ జోక్స్

Advertisement

గత కొన్ని వారాలుగా పెద్ద-చిన్న అనే తేడా లేకుండా హాట్ హీరోయిన్స్ అందరూ మాల్దీవ్స్ లో మునిగితేలుతున్నారు. బాలీవుడ్ తో మొదలైన ఈ మాల్దీవ్స్ హల్ చల్ టాలీవుడ్ కు పాకింది. రకుల్ ఏకంగా ఫ్యామిలీతో సహా టూర్ ఎంజాయ్ చేసి మొన్నే మళ్ళీ ఇంటికొచ్చింది. ప్రస్తుతం సమంత తన భర్త చైతన్యతో కలిసి సేద తీరుతోంది. అలాగే బొలెడుమంది అందాల భామలు కూడా మాల్దీవుల సముద్ర తీరాన బికినీల్లో రచ్చ చేస్తున్నారు.

వీళ్ళందరూ సరదాగా మాల్దీవ్స్ వెళ్లినప్పటికీ.. కామన్ పాయింట్ ఏమిటంటే వీళ్ళందరినీ ఒక రిసార్ట్ మేనేజ్మెంట్ ప్రమోషన్స్ కోసం డబ్బులు ఇచ్చి మరీ అక్కడకు పిలిపించుకుంది. కరోనా అనంతరం మాల్దీవ్స్ సేఫ్ అని టాక్ వచ్చేలా చేయడమే ఈ ప్రమోషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే.. ఈ ప్రమోషన్ లో తనను భాగం చేయనందుకు అదా శర్మ గట్టిగా ఫీల్ అయినట్లుంది. అదా శర్మ స్టార్ హీరోయిన్ కానప్పటికీ.. తన బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తూనే ఉంటుంది.

అలాంటిది ఆమెను అక్కడికి పిలవకపోవడంతో బాగా హర్ట్ అయ్యింది పాప. అందుకే తన షూటింగ్ లొకేషన్ లోని వీడియో పోస్ట్ చేసి.. ఇది మాల్దీవ్స్ కాదు అని సెటైర్ వేసింది. అది చూసిన కొందరు పిలవకపోతే బాధ ఎందుకు అని కామెంట్ చేయగా.. ఇది సమంత, రకుల్ మీద సెటైర్ అని ఇంకొందరు భావించారు.


Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus